టి.సి.ఎస్ లో సామూహిక తొలగింపులు

భారత దేశంలో అతి పెద్ద సాఫ్ట్ వేర్ ఉత్పత్తి మరియు సేవల కంపెనీగా ప్రసిద్ధి గాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి.సి.ఎస్) కంపెనీ గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ నుండి తొలగించబడిన ఉద్యోగులు ఈ మేరకు బెంగుళూరు/కర్ణాటక డిప్యూటీ లేబర్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారు అధికారికంగా ఇంకా ఫిర్యాదు చేయవలసి ఉందని తెలుస్తోంది. ఉద్యోగులను సామూహికంగా తొలగించే కార్యక్రమాన్ని టి.సి.ఎస్ కంపెనీ యాజమాన్యం చేపట్టిందని ఉద్యోగులు చెబుతున్నారు.…