నిర్భయ డాక్యుమెంటరీ: నిషేధం సమంజసమేనా?

అద్దంలో ప్రతిబింబం నిర్భయ మళ్ళీ పతాక శీర్షికలకు ఎక్కింది. బి.బి.సి ఆ పుణ్యం కట్టుకుంది. నిర్భయ ఎదుర్కొన్న అమానవీయ దుష్కృత్యం నేపధ్యాన్ని శక్తివంతంగా వీడియో కట్టిన డాక్యుమెంటరీని ప్రసారం చేయడం ద్వారా బి.బి.సి ఒక మంచి పని చేసింది. కేసులో శిక్ష పడిన రామ్ సింగ్, ముఖేష్, అక్షయ్, వినయ్, జువెనైల్ లు భారత సమాజం తయారు చేసుకున్న నేరస్ధులన్న చేదునిజాన్ని ఈ డాక్యుమెంటరీ కళ్ళకు కట్టినట్లు వివరించింది. పార్లమెంటులోనూ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ కూర్చొని ఉన్న…