ప్రజల ప్రయోజనాలకు హాని చేశానని ఒప్పుకున్న దమ్మున్న మంత్రి జైరాం రమేశ్

పర్యావరణ చట్టాల అమలు విషయంలో చాలా సార్లు రాజీ పడ్డానని కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ అంగీకరించారు. అనేక పర్యావరణ ఉల్లంఘనలను తాను మాఫీ చేశానని తెలిపారు. చట్టాల ఉల్లంఘనలను క్రమబద్ధీకరించడానికి తాను బద్ధవ్యతిరేకిననీ, కానీ కొన్ని కేసుల్లో రాజీ పడే విధంగా ఒత్తిడులు వచ్చాయనీ తెలిపారు. జైరాం రమేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖను చేపట్టినప్పటినుండీ వాణిజ్య, పరిశ్రమల, వ్యవసాయ మంత్రివర్గాలనుండీ విమర్శలను ఎదుర్కొన్నాడు. చట్టాలంటూ ముంకు పట్టు పట్టి అర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఆటంకంగా…