ఆశిష్ నంది దళిత వ్యతిరేక వ్యాఖ్యలు, ఒక పరిశీలన

ఎస్.సి, ఎస్.టి, ఒ.బి.సి కులాలనుండి అత్యధికంగా అవినీతిపరులు వస్తున్నారని ఆశిష్ నంది చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. దేశ వ్యాపితంగా ఆయనకి వ్యతిరేకంగా ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడంతో సదరు ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ ఆశిష్ నంది సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భావోద్వేగాలు మిన్ను ముట్టిన వాతావరణంలో తనపై దాడి జరగవచ్చని ఆయన కోర్టుకి విన్నవించాడు. ఆశిష్ నంది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయన అరెస్టుపై…