జైట్లీపై విచారణ చట్ట విరుద్ధం -కేంద్రం
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని ఆరోపించబడుతున్న డిడిసిఏ కుంభకోణంపై విచారణ చట్ట విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ‘సలహా ఇవ్వండి’ అంటూ లేఖ రాయించుకుని ఆనక ‘ఆ విచారణ చట్టబద్ధం కాదు’ అని బి.జె.పి ప్రభుత్వం ప్రకటించేసింది. ‘అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ చట్ట విరుద్ధం’ అని నిర్ధారించిన మొట్ట మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం ఘనతను మూటగట్టుకుంది. ‘అవినీతిని అంతం…