మోడి కేబినెట్ విస్తరణకు అర్ధమేమి? -కార్టూన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. ఇది యధావిధిగా మోడి మార్కు విస్తరణగానే ఉన్నదని పత్రికలు, ఛానెళ్లు వ్యాఖ్యానించగా, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని అభివృద్ధి లక్ష్యంగా కొన్ని సర్దుబాట్లు జరిగాయని బి‌జే‌పి ప్రభుత్వ నేతలు వ్యాఖ్యానించారు. బి‌జే‌పి నేతలు ఏమి చెప్పినా, ఏ కారణము లేకుండా, ఏ ఫలితమూ ఆశించకుండా ప్రధాన మంత్రి తన కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేస్తారంటే నమ్మటానికి వీలు లేదు. “కేబినెట్…

అజ్ఞానం, మూఢత్వం వారి స్వాభావిక లక్షణం!

ఐరోపాలో పారిశ్రామిక విప్లవ క్రమాన్ని ఆటంకపరిచేందుకు చర్చి అధికార వ్యవస్ధ చేయని ప్రయత్నం లేదు. కోపర్నికస్ లాంటి వారిని జీవిత పర్యంతం వేధించారు. చర్చి ఒత్తిడికి లొంగి ఒక దశలో కోపర్నికస్ తన గ్రహ సిద్ధాంతాలను తాత్కాలికంగానే అయినా తప్పు అని చెప్పాల్సి వచ్చింది. మరో గ్రహ శాస్త్రవేత్త బ్రూనోను నగరం కూడలిలో స్తంభానికి కట్టేసి తగలబెట్టిన చరిత్ర కేధలిక్ క్రైస్తవ మత మూఢుల సొంతం! వాస్తవాలపై కాకుండా మతపరమైన ఊహలకు, ఫ్యాంటసీలపై ఆధారపడిన చర్చి నమ్మకాలు…

వైవిధ్యానికీ, బహుళ గొంతుకలకూ జేఎన్యూ వేదిక

(ప్రముఖ పాత్రికేయులు, వ్యవసాయరంగ నిపుణులు, ‘రామన్ మెగసెసే’ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ జేఎన్యూ ఉద్యమానికి మద్దతుగా గత 19న విద్యార్థులనుద్దేశించి క్యాంపస్లో ప్రసంగించారు. ఆ ప్రసంగానికి పూర్తిపాఠం ఇది.) *****అనువాదం: జి వి కే ప్రసాద్ (నవ తెలంగాణ)***** నేను జేఎన్యూ పూర్వ విద్యార్థిని కావడం నాకు గర్వకారణం. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన కొద్ది కాలానికే నేనీ క్యాంపస్లో అడుగుపెట్టాను. ఆ రోజుల్లో పురుషుల ‘గంగా’ హాస్టల్ రాజకీయంగా ఎక్కువ క్రియాశీలంగా ఉండేది. నేనందులోనే ఉండేవాణ్ని.…

JNU లోపల కన్హయ్యపై దాడి!

ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా ఉన్మాదపూరిత భావోద్వేగాలతో దేశంలో గాలిని నింపేశాక కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ లాంటి వాళ్ళకు రక్షణ ఎక్కడ ఉంటుంది? దేశ రాజధానిలో కోర్టు ఆవరణలోనే న్యాయాన్ని రక్షిస్తామని పట్టా పుచ్చుకున్న న్యాయవాదులు పోలీసుల సాక్షంగా కన్హయ్యపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో తన వారి మధ్య భద్రంగా ఉన్నాడనుకున్న కన్హయ్యను దుండగుడు ఒకరు బూతులు తిట్టి, కొట్టారని వార్త వెలువడింది. పి‌టి‌ఐ వార్తా సంస్ధ ప్రకారం JNUSU అధ్యక్షుడు…

వీడియో మార్ఫింగ్ స్మృతి సలహాదారు పని?

జే‌ఎన్‌యూ విద్యార్ధుల ఆందోళన, అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమం లకు సంబంధించి ఇంటర్నెట్ లోనూ, టి.వి న్యూస్ ఛానెల్స్ తదితర ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచారంలో ఉన్న 7 వీడియోల్లో మూడు వీడియోలలో ఉద్దేశ్యపూర్వకంగా మార్పులు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్ విచారణలో తేలిన సంగతి విదితమే. మార్పులు చేసిన మూడు వీడియోల్లో ఒక వీడియోను ఎడిట్ చేయగా, రెండు వీడియోలు కావలసిన అర్ధం వచ్చే విధంగా, కోరుకున్న ప్రభావం కలిగే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా మార్ఫింగ్ చేశారని…

జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటం: సమగ్రంగా -2

మొదటి భాగం తరువాత…… ఫిబ్రవరి 17 తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు ఏవీ అమలు జరగలేదు. అదే లాయర్లు మళ్ళీ దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. కన్హైయా చుట్టూ డజన్ల మంది పోలీసులు వలయంగా ఏర్పడి లోపలికి తీసుకెళ్లినా లాయర్లు దాడి చేసి కొట్టారు. కోర్టు లోపలికి వెళ్ళాక కూడా మెజిస్ట్రేటు ముందే కన్హైయాను ఓ లాయర్ కొట్టాడు. పక్కనే పోలీసులు ఉన్నా నిరోధించలేదు. ఆ లాయర్ బైటికి వచ్చి ‘మా పని చేసేశాం’ అని విలేఖరుల…

సమగ్రంగా: హిందూత్వపై జే‌ఎన్‌యూ పోరాటం -1

(జే‌ఎన్‌యూ విద్యార్ధుల తిరుగుబాటుపై ఇటీవలి రోజుల్లో జరిగిన పరిణామాలను జోడిస్తూ చేసిన సమగ్ర విశ్లేషణ ఇది. సాధ్యమైనంత సమగ్రంగా రాసేందుకు ప్రయత్నించాను. అందువల్ల పెద్ద ఆర్టికల్ అయింది. ఇందులో గత ఆర్టికల్స్ లోని కొన్ని అంశాలను కూడా జోడించాను. అందువలన ఇంతకు ముందు చదివిన భావన కొన్ని చోట్ల కలగవచ్చు. -విశేఖర్) ********* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రోహిత్ ఆత్మహత్య, తదనంతర విద్యార్థి ఉద్యమం తెరిపిడి పడక ముందే హిందూత్వ పాలకులు జవహర్ లాల్ నెహ్రూ…

చక్రవర్తిగారి కొత్త జాతీయవాదం -ది హిందు

“The Emperor’s new nationalism” శీర్షికతో ఫిబ్రవరి 20 వ తేదీ ది హిందూ సంపాదకీయానికి యధాతధ అనువాదం. ********* హైదారాబాద్ నుండి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వరకూ, రోహిత్ వేముల మరణం నుండి కన్హైయా కుమార్ అరెస్టు వరకు పాలక భారతీయ జనతా పార్టీ తలపెట్టిన రాజకీయ ఎజెండాను స్పష్టంగా గుర్తించవచ్చు. మొదటి ఊపులో ఇది అత్యున్నత నాయకత్వం అంతా -యూనియన్ కేబినెట్ మంత్రులతో సహా- విద్యార్ధి నాయకులతో తగువు పెట్టుకోవడానికీ సంఘ్ విద్యార్ధి…

అసలు సమస్యలను తప్పించిన JNU-అఫ్జల్ రగడ!

ఏది దేశ ద్రోహం? ఏది దేశభక్తి? నిత్యం భావ సంఘర్షణలు జరిగే సమాజంలో ఉక్కు ద్రావకాన్ని పోత పోసి ఆరబెట్టినట్లుగా దేశభక్తి, దేశద్రోహం ఉండగలవా? ఉనికిలో ఉన్న మనుషులు అందరికీ ఒకటే దేశ భక్తి, ఒకటే దేశ ద్రోహం ఉండగలవా? మనిషి మెదడు వేనవేల ఆలోచనలకు నిలయం. మనిషి సామాజిక ఆచరణ ఎన్ని పోకడలు పోతుందో అన్ని పోకడలూ పొందగల వేలాది సంభావ్యతలు (probabilities) మనిషి మెదడులో వీరంగం ఆడుతుంటాయి. సమూహంలోని మనుషుల సామాజిక ఆచరణలో ఉమ్మడితనం…

పాక్ అనుకూల నినాదాలు చేసింది ఏ‌బి‌వి‌పి? -వీడియో

జవహర్ లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జే‌ఎన్‌యూ‌ఎస్‌యూ) అధ్యక్షుడు కనహైయా కుమార్ పై ‘దేశ ద్రోహం’ కేసు మోపి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడీ వ్యవహారం సరికొత్త మలుపు తీసుకుంది. అఫ్జల్ గురును ఉరి తీసి 3 సం.లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 తేదీన జే‌ఎన్‌యూ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్ధి సంఘం అధ్యక్షులు, మరి కొందరు విద్యార్ధులు పాక్ అనుకూల, ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర…

ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్

హిందూత్వ ఫాసిజం తన ఫాసిస్టు ప్రయాణంలో మరో అడుగు వేసింది. ఈసారి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పంజా విసిరింది. విద్యార్ధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అపహాస్యం చేస్తూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ పైకి ఢిల్లీ పోలీసులను ఉసి గొల్పింది. యూనివర్సిటీ విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని తానే ఆదేశించానని కేంద్ర హోమ్ మంత్రి సగర్వంగా చాటుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులు ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలు వ్యక్తం చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఎకాఎకిన నిర్ధారించేశారు.…