జేమ్స్ ఫోలి చావు మరో వరల్డ్ వార్ కు దారి తీస్తుందా?
ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కు చెందిన మిలిటెంటు ఒకరు అమెరికా విలేఖరి జేమ్స్ ఫోలీ తలను కత్తితో కోసి చంపినట్లు చూపుతున్న వీడియో ఇటీవల ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. ఈ వీడియోను సాకుగా చూపుతూ అమెరికా మళ్ళీ మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధానికి నగారా మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ లు యుద్ధ జ్వర పీడితులైనట్లుగా ప్రకటనలు గుప్పిస్తుండగా…