బీహార్: జె.డి(యు)కు కాంగ్రెస్ మొండి చెయ్యి -కార్టూన్

మతోన్మాదం పేరుతో బి.జె.పి తో సంబంధాలు తెంచుకున్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలినట్లు కనిపిస్తోంది. బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి) మరియు పాశ్వాన్ పార్టీ లోక్ జనతాంత్రిక్ పార్టీ (ఎల్.జె.పి) లతో పొత్తు కట్టడానికి కాంగ్రెస్ దాదాపు నిశ్చయం అయిందని పత్రికలు చెబుతున్నాయి. ఇక ప్రకటన చేయడమే మిగిలిందని తెలుస్తోంది. ఇదే నిజమయితే బీహార్ లో జె.డి(యు) ఒంటరిగా మిగిలిపోతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు…