ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిపై తప్పుడు వార్తలు

గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూ వచ్చింది. ఉక్రెయిన్ తన శక్తి మేరకు ప్రతిఘటన ఇస్తూ వచ్చింది. ఈ యుద్ధం లేదా రష్యా దాడి ఏ విధంగా పురోగమించింది అన్న విషయంలో పత్రికలు ముఖ్యంగా పశ్చిమ పత్రికలు కనీస వాస్తవాలను కూడా ప్రజలకు అందించలేదు. భారత పత్రికలు, ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు పత్రికలతో సహా పశ్చిమ పత్రికల వార్తలనే కాపీ చేసి ప్రచురించాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్^ప్రెస్, ఎన్‌డి‌టి‌వి మొదలు…

శాంతి చర్చలు: విరమణ దిశలో రష్యా ఉక్రెయిన్-దాడి?

ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడి మెల్లగా విరమించే వైపుగా వెళుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఇస్తాంబుల్ చర్చల దరిమిలా రష్యా నుండి వెలువడిన ప్రకటనలను బట్టి ఈ అభిప్రాయానికి రావలసి వస్తోంది. టర్కీ నగరం ఇస్తాంబుల్ లో ఇరు పక్షాల మధ్య జరుగుతున్న చర్చలలో ఉక్రెయిన్ నుండి నిర్దిష్టంగా స్పష్టమైన ప్రతిపాదనలు తమకు అందాయని రష్యన్ చర్చల బృందం ప్రకటించింది. “టర్కీ నగరం ఇస్తాంబుల్ లో మార్చి 29 తేదీన జరిగిన చర్చల…

ఉక్రెయిన్ పై దాడి: అమెరికా హిపోక్రసీ -కార్టూన్

ఉక్రెయిన్ పై రష్యా మిలట్రీ చర్య ప్రకటించి 12 రోజులు గడిచాయి. అనుకున్న స్థాయిలో రష్యా సేనలు ఉక్రెయిన్ లో పురోగమించలేకపోతున్నాయని దానికి కారణం ఉక్రెయిన్ బలగాలు రష్యా పై ఆధిక్యత సాధించడమే అనీ పశ్చిమ పత్రికలు నమ్మ బలుకుతున్నాయి. అయితే ఈ వాదనను కొందరు విశ్లేషకులు తిరస్కరిస్తున్నారు. రష్యా ఉద్దేశ్యపూర్వకంగానే మిలట్రీ చర్యను నెమ్మదిగా ముందుకు తీసుకుపోతోందని, తద్వారా ఉక్రెయిన్ పౌరులు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని వారు వివరిస్తున్నారు. సిరియాలో చేసినట్లుగానే ఉక్రెయిన్ బలగాలను, వారి…