స్నోడెన్ ఒక హీరో -జులియన్ అసాంజే

– ప్రపంచ ప్రజల అంతర్జాల కార్యకలాపాల పైనా, టెలిఫోన్ సంభాషణల పైనా అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిన సంగతిని లోకానికి వెల్లడి చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను ‘హీరో’ గా వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే అభివర్ణించారు. ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధంలో వేలాది అమాయక పౌరులను అమెరికన్ బలగాలు చిత్రహింసలు పెట్టి చంపిన వైనాన్ని, వివిధ దేశాలలో నియమితులైన తమ రాయబారుల ద్వారా ఆ దేశాల్లో అమెరికా గూఢచర్యానికి పాల్పడుతున్న మోసాన్ని ‘డిప్లోమేటిక్ కేబుల్స్’ ద్వారా ప్రపంచానికి…

భావ ప్రకటన స్వేచ్ఛ: క్యూబాకి ఒకటి, అమెరికాకి మరొకటి -కార్టూన్

‘యోవాని సాంఛేజ్’ పశ్చిమ దేశాలకు మహా ఇష్టురాలు. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి ప్రకటించడం దానికి కారణం. ఆమె ఈ మధ్య ప్రపంచ పర్యటనకి బయలుదేరింది. క్యూబాలో జనం ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవిడ ప్రచారం చేస్తోంది. యోవాని అసమ్మతిని క్యూబా ప్రభుత్వం సహించలేకపోతోందని, ఆమె భావ ప్రకటనా స్వేచ్చని హరిస్తోందని అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు మొత్తుకుంటాయి.  ఆమె అసమ్మతి సహజంగానే పశ్చిమ కార్పొరేట్ పత్రికలలో ప్రముఖ స్ధానం పొందుతోంది. యోవాని భావ ప్రకటన స్వేచ్చ…

అంతర్జాల స్వేచ్ఛా పిపాసి, RSS, Redditల నిర్మాత ఆత్మహత్య

విజ్ఞానం ఒకరి సొత్తు కాదనీ, అది అందరికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలని పోరాడిన ఆరన్ స్వార్జ్ ఎఫ్.బి.ఐ వేధింపుల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. 14 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ప్రఖ్యాత వెబ్ ఫీడ్ వ్యవస్థ అయిన RSSను నిర్మించిన ఆరన్ ఆ తర్వాత సోషల్ న్యూస్ వెబ్ సైట్ Reddit నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పిన్న వయసులోనే ఇంటర్నెట్ మేధావి గానూ, గుత్త స్వామ్య వ్యతిరేకి గానూ అవతరించిన ఆరన్ 26 యేళ్ల వయసులోనే…

ఆసాంజే అరెస్టుకి బ్రిటన్ రహస్య పధకం

ఈక్వడార్ రాయబార కార్యాలయంలో శరణు పొందిన జూలియన్ ఆసాంజే ని ఏ పరిస్ధితిలోనైనా అరెస్టు చెయ్యాల్సిందేనని లండన్ పోలీసులకు వచ్చిన రహస్య ఆదేశాలు బట్టబయలయ్యాయి. పోలీసు అధికారి చేతిలో ఉన్న ఆదేశ పత్రాలలోని అక్షరాలు విలేఖరుల కంటికి చిక్కడంతో రహస్య పధకం వెల్లడయింది. ఈక్వడార్ ‘రాజకీయ ఆశ్రయం’ లో రక్షణ పొందుతున్నప్పటికీ ఎట్టి పరిస్ధితుల్లోనూ జూలియన్ ఆసాంజే ను అరెస్టు చెయ్యడానికి బ్రిటన్ నిశ్చయించిందని తెలిసి వచ్చింది. వివిధ దేశాల మధ్య రాయబార సంబంధాల విషయమై కుదిరిన…

పీడనకు ఎదురొడ్డింది బ్రిటనూ, ఆస్ట్రేలియా కాదు స్వతంత్ర ఈక్వడార్! -అస్సాంజ్

“పీడన నుండి నన్ను కాపాడడానికి నిలబడ్డ దేశం బ్రిటన్ కాదు, జన్మ భూమి ఆస్ట్రేలియా కూడా కాదు… ఒక సాహసోపేతమైన స్వతంత్ర లాటిన్ అమెరికా దేశం.” ఈ మాటలన్నది జూలియన్ అస్సాంజ్. స్వీడన్ అనే ఒక స్కాండినేవియా దేశాన్ని ముందు నిలిపి దుష్ట శక్తి అమెరికా రెండు సంవత్సరాలుగా సాగిస్తున్న పీడననూ, వేధింపులనూ ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ అన్న మాటలు. ప్రజా స్వామ్యానికీ, మానవ హక్కులకూ, స్వేచ్ఛా సమానత్వాలకూ భూతల స్వర్గంగా జబ్బ చరుచుకునే ప్రపంచ పోలీసు…

నేనే జులియన్! అంతర్జాతీయ యోధుడి కోసం బ్రిటిషర్ల నిరసనలు -ఫోటోలు

మహా మహులుగా, తలపండిన రాజకీయ పోరాట యోధులుగా, వ్యవస్ధలను నడిపించే దేశ నాయకులుగా, ఆర్ధిక చిక్కుల పరిష్కర్తలుగా ఫోజులు కొట్టే దేశ దేశాల నాయకమ్మన్యులు సైతం అమెరికా ధూర్త రాజ్యం ముందు సాగిలపడి సలాములు కొడుతున్న పాడు కాలం ఇది. సమస్త భూగోళాన్ని క్షణమాత్రంలో భస్మీ పటలం చేసే అణ్వస్త్ర శస్త్రాల బలిమితో విరగబడుతున్న అంకుల్ శామ్ దేశ దేశాల్లో సాగించిన రహస్య వికృత క్రీడలని, ‘వికీలీక్స్’ ద్వారా ప్రపంచ ప్రజల ముందు ఆరబోసిన డిజిటల్ యోధుడికి…

ఈక్వడార్ ధిక్కారం, బ్రిటన్ బెదిరింపుల మధ్య అస్సాంజ్ కి రాజకీయ ఆశ్రయం మంజూరు

దక్షిణ అమెరికా దేశం ‘ఈక్వడార్’ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ బెదిరింపులను ఎడమ కాలితో తన్నేస్తూ ‘జూలియన్ అస్సాంజ్’ కు ‘రాజకీయ ఆశ్రయం’ ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వీడన్ లో తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ ను స్వీడన్ కూ, అక్కడి నుండి అమెరికాకు తరలించాలని అమెరికా, యూరప్ దేశాలు పన్నిన కుట్రను భగ్నం చేసే కృషిలో తన వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. గొప్ప ప్రజాస్వామ్య దేశాలం అంటూ తమ జబ్బలు తామే చరుచుకునే…

ఎంబసీ నుండి బైటికి వస్తే అస్సాంజ్ అరెస్టు ఖాయం

జూలియన్ అస్సాంజ్ ఈక్వెడార్ ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు చేయడానికి లండన్ పోలీసులు ఎంబసీ ముందు కాపు కాశారు. ఎంబసీ లోకి ప్రవేశించడం ద్వారా కోర్టు బెయిల్ షరతులలో ఒకటయిన ‘రాత్రి పూట కర్ఫ్యూలో ఉండవలసిన’ నిబంధనను జులియన్ ఉల్లంఘించాడని లండన్ పోలీసులను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. రాత్రి పది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకూ తనకు నిర్దేశించిన ఇంటినుండి అస్సాంజ్ బైటికి రాకూడదనీ, కానీ ఆయన మంగళవారం మొత్తం ఈక్వెడార్ ఎంబసీలో…

జూలియన్ అస్సాంజ్: స్వీడన్ తరలింపుకు ఇంగ్లండ్ కోర్టు అంగీకారం

ఆస్ట్రేలియాకు చెందిన వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ ‘జూలియన్ అస్సాంజ్’ ను స్వీడన్ కు తరలించడానికి ఇంగ్లండు సుప్రీం కోర్టు అంగీకరించింది. జూలియన్ ను తమకు అప్పగించాలన్న స్వీడన్ ప్రాసిక్యూటర్ల కోరిక న్యాయబద్ధమేనని మెజారిటీ తీర్పు ప్రకటించింది. ‘రీ ట్రయల్’ కు జూలియన్ కోరవచ్చని తెలుస్తోంది. దానివల్ల తరలింపు మరింత ఆలస్యం అవుతుందే తప్ప ఆపడం జరగకపోవచ్చని న్యాయ నిపుణులను ఉటంకిస్తూ పత్రికలు వ్యాఖ్యానించాయి. డిసెంబరు 2010 లో జూలియన్ బ్రిటన్ లో అరెస్టయ్యాడు. ఒక మహిళను రేప్…

వికీలీక్స్ అస్సాంజ్ ను స్వీడన్‌ అప్పగింతకు బ్రిటిష్ అప్పిల్ కోర్టు నిర్ణయం

తనను స్వీడన్ కు అప్పగించడానికి వ్యతిరేకంగా అప్పీలు కోర్టుకు నివేదించుకున్న జులియన్ అస్సాంజ్, అక్కడ అప్పీలును కోల్పోయాడు. స్వీడన్ పోలీసులకు జులియన్ ను అప్పగించడానికి అనుకూలంగా అప్పీలు కోర్టు తీర్పునివ్వడంతో జులియన్ అస్సాంజ్ అప్పగింత అనివార్యం అయ్యింది. అయితే హైకోర్టుకు వెళ్ళడానికి జులియన్ కు ఇంకా అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదీ లేనిదీ హై కోర్టులోనే తేలనున్నది. వికీలీక్స్ అధినేత జులియన్ అస్సాంజ్ గత సంవత్సరం డిసెంబరు నెలలో బ్రిటన్ లో అరెస్టు…

వికీలీక్స్ పత్రాలను (పేర్లతో సహా) ప్రచురించక తప్పలేదు -ఛీఫ్ ఎడిటర్ అస్సాంజ్

ఇంగ్లండులో గృహ నిర్బంధంలో ఉన్న జులియన్ అస్సాంజ్, తాను వాస్తవ డిప్లొమేటిక్ కేబుల్స్ ను వాటి వాస్తవ రూపంలో పేర్లతో ప్రచురించక తప్పలేదని ఒక కార్యక్రమంలో తెలిపాడు. వీడియో కాల్ ద్వారా బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జులియన్ ఈ విషయం తెలిపాడు. అమెరికా రాయబారులకు సమాచారం అందించిన వారి పేర్లను తొలగించి కేబుల్స్ ఇప్పటివరకూ ప్రచురించిన జులియన్ సంకేతపదం వేరొక చోట ప్రచురించబడడంతో మొత్తం రెండున్నర లక్షల కేబుల్స్ నూ ప్రచురించక తప్పలేదని బెర్లిన్ శ్రోతలకు…

ఈజిప్టు, ట్యునీషియా తిరుగుబాట్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లు సహాయపడ్డాయనడం నిజం కాదు

ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేసినట్లు ఈజిప్టు ఉద్యమ నిర్మాణంలో ట్విట్టర్, ఫేస్ బుక్ ల పాత్ర ఏమీ లేదు. ఉద్యమ వార్తలను ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రాసుకున్నారు గానీ ఉద్యమ వ్యాప్తికి అవేమీ ఉపయోగపడలేదు. అసలు ట్విట్టర్,  ఫేస్ బుక్ ల ద్వారా ఉద్యమాలు వస్తాయనడమే పెద్ద తప్పు, మోసం కూడా. కేవలం ఇంటర్నెట్ లో సందేశాలతో ఉద్యమ కాంక్షలను రగిల్చే పనైతే ఫేస్ బుక్ లో కాజ్ ల పేరుతో…

అంతర్జాతీయ ఒత్తిడితో దారుణ నరకంనుండి బైటపడ్డ అమెరికా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”

ప్రపంచ దేశాలపై తన ప్రయోజనాల కోసం బాసిజం చేసే అమెరికా, బహుశా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఒత్తిడికి, విమర్శలకు లొంగింది. దాదాపు తొమ్మిది నెలల నుండి సొంత దేశీయుడినే నరక బాధలు పెడుతున్న జైలు అధికారులు విచారణా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”ని సాలిటరీ కనఫైన్‌మెంట్ సెల్ నుండి బైటకు అనుమతించింది. వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాలకు సంబంధించిన డాక్యుమెంట్లను, యాభై సంవత్సరాల డిప్లొమాటిక్ కేబుల్స్ ను లీక్ చేశాడన్న ఆరోపణలపై బ్రాడ్లీ…

‘ది హిందూ’ చేతిలో ఇండియాకి సంబంధించిన ‘వికీ లీక్స్’ డాక్యుమెంట్లు

అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు…