ఆసాంజే నిర్బంధం నిరంకుశం -ఐరాస

వికీలీక్స్ వ్యవస్ధాపక ఎడిటర్ జులియన్ ఆసాంజే నిర్బంధం చట్ట విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఆసాంజే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఐరాస కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణ వచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కమిటీ నిర్ణయాన్ని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారని పత్రిక తెలిపింది. స్వీడన్ లో దాఖలయిన ఒక తప్పుడు కేసు దరిమిలా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో గత నాలుగు సంవత్సరాలుగా లండన్ పోలీసు నిర్బంధంలో ఆసాంజే గడుపుతున్నాడు. ఆసాంజేను…

గౌరవ మర్యాదలకు విఘాతం -ది హిందు సంపాదకీయం

(బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానంలో అమెరికన్ ఎన్.ఎస్.ఏ లీకర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నాడన్న అనుమానంతో అమెరికా పనుపున ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అనుమతి నిరాకరించి, ఆస్ట్రియాలో బలవంతంగా కిందకి దించిన ఉదంతం గురించి ది హిందు పత్రిక బుధవారం -జులై 10- రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం -విశేఖర్) “తన ఇష్టం లేకుండా ఒక పావుగా ఉండవలసిన అవసరం గానీ, అందుకు తగిన కారణం గానీ లాటిన్ అమెరికాకు లేదు,”…

స్నోడెన్ లిబర్టీ – అమెరికన్ లిబర్టీ -కార్టూన్

అమెరికా రాజ్యాధినేతల అక్రమ గూఢచర్యాన్ని లోకానికి తెలిపిన స్నోడెన్ లిబర్టీ ఇప్పుడు భద్రమైన తావు కోసం ఖండాంతరాలు దాటి పరుగులు పెడుతోంది. స్నోడెన్ లిబర్టీ ఇప్పుడు ఘనత వహించిన అమెరికన్ లిబర్టీకి సైతం కంటగింపుగా మారిపోయింది. ప్రఖ్యాత లిబర్టీ విగ్రహాన్ని కేవలం విగ్రహ పాత్ర వరకే పరిమితం చేసింది అమెరికా రాజ్యమైతే, దానికి ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నది ఎడ్వర్డ్ స్నోడెన్. అమెరికన్ లిబర్టీ అమెరికన్ రాజులకు ఎంతగా దాసోహం అయిందంటే, ప్రాణం పోసుకున్న లిబర్టీ పైన తానే…

స్నోడెన్ ఒక హీరో -జులియన్ అసాంజే

– ప్రపంచ ప్రజల అంతర్జాల కార్యకలాపాల పైనా, టెలిఫోన్ సంభాషణల పైనా అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిన సంగతిని లోకానికి వెల్లడి చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ను ‘హీరో’ గా వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే అభివర్ణించారు. ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధంలో వేలాది అమాయక పౌరులను అమెరికన్ బలగాలు చిత్రహింసలు పెట్టి చంపిన వైనాన్ని, వివిధ దేశాలలో నియమితులైన తమ రాయబారుల ద్వారా ఆ దేశాల్లో అమెరికా గూఢచర్యానికి పాల్పడుతున్న మోసాన్ని ‘డిప్లోమేటిక్ కేబుల్స్’ ద్వారా ప్రపంచానికి…