కన్హైయా వీడియో ఎలా ఫేక్? -వీడియో

కన్హైయా కుమార్, ఉమర్ ఖలీద్, రామ నామ, అశుతోష్ మరో ఇద్దరు జే‌ఎన్‌యూ విద్యార్ధులు ఫిబ్రవరి 9 తేదీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి, బి‌జే‌పి అధ్యక్షుడు, ఇతర కేంద్ర మంత్రులు, బి‌జే‌పి నేతలు, ఎం‌పిలు, ఎం‌ఎల్‌ఏలు ఏకబిగిన ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల్ని పురమాయించి దేశద్రోహం కేసు కూడా విద్యార్ధులపై బనాయించారు. కన్హైయాను అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తుంటే హిందూత్వ లాయర్ గూండాలు ఆయన్ని కొట్టారు. కోర్టుకు వచ్చిన…

ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌? -జీ విలేఖరి రాజీనామా

[జీ న్యూస్ విలేఖరి విశ్వ దీపక్ చానెల్ కు రాజీనామా చేస్తూ చానెల్ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖనే ఆయన రాజీనామా లేఖగా వెలువరించారు. లేఖ ఆంగ్ల అనువాదాన్ని ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఇతర పత్రికలు కూడా ప్రచురించి ఉండవచ్చు. విశ్వ దీపక్ రాజీనామా లేఖ అనువాదమే ఈ టపా. ఈ అనువాదాన్ని బ్లాగ్ పాఠకుడు సందీప్ ఎస్‌పి గారు వ్యాఖ్య ద్వారా అందించారు. నవ తెలంగాణ పత్రికలో మొదట అచ్చయిన ఈ…

‘రివర్స్ స్టింగ్’ లో దొరికిపోయిన జీ న్యూస్ బ్లాక్ మెయిలింగ్

స్టింగ్ ఆపరేషన్లతో ఠారెత్తిస్తున్న మీడియా రివర్స్ స్టింగ్ ఆపరేషన్ లో బైటపడిపోయి నీళ్ళు నములుతోంది. జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జె.ఎస్.పి.ఎల్) ఛైర్మన్ నవీన్ జిందాల్ ను బొగ్గు కుంభకోణం స్టోరీతో బ్లాక్ మెయిల్ చెయ్యబోయిన జీ న్యూస్ ఎడిటర్లు రహస్య కెమెరాకి అడ్డంగా దొరికిపోయారు. కుంభకోణం స్టోరీని ప్రసారం చెయ్యకుండా ఆపడానికి మొదట 20 కోట్లు ఆ తర్వాత 100 కోట్లు కెమెరా ముందు డిమాండ్ చేసిన జీ న్యూస్ ఎడిటర్లు తాము స్టింగ్ ఆపరేషన్…