నోట్ల రద్దు: అధమ స్ధాయిలో ఫ్యాక్టరీ, సేవల జీడీపీ
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతుండగా భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది. ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబరు నెలలో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నదని హఫింగ్టన్ పోస్ట్ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత జీడీపీలో అత్యధిక వాటా -60 శాతం వరకు- సేవల రంగానిదే. కనుక మొత్తం జీడీపీ…