ప్రశ్న: గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ గురించి వివరించండి

ప్రశ్న (పేరు ఇవ్వలేదు): క్యూబా వ్యాక్సిన్ ఆర్టికల్ లో గ్లోబల్ సౌత్ అన్న పదజాలం వాడారు. భూమధ్య రేఖకు దిగువ దేశాలు అంటూనే ‘కొన్ని పరిమితులతో’ అన్నారు. కాస్త వివరించగలరు. జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ స్ధాయి పరిణామాలు, ముఖ్యంగా భౌగోళిక రాజకీయార్ధిక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆంగ్ల పత్రికలు తరచుగా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అన్న పదజాలాల్ని ఉపయోగిస్తాయి. ఈ పేర్లు సూచించే విధంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్న…

రష్యా గ్యాస్ కు ప్రత్యామ్నాయం కోసం జి7 వెతుకులాట!

అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేసినట్లే జరుగుతోంది. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా యూరప్ గ్యాస్ మార్కెట్ ను అమెరికా చేజిక్కించుకోవడానికి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. రష్యా నుండి ఇన్నాళ్లూ భారీ మొత్తంలో సహజవాయువు సరఫరా పొందుతున్న ఐరోపా దేశాలకు రష్యాకు ప్రత్యామ్నాయంగా అమెరికా షేల్ గ్యాస్ ను ఉపయోగపెట్టుకోవడానికి నిర్ణయించే వైపుగా అడుగులు పడుతున్నాయి. రోమ్ లో మూడు రోజుల క్రితం ముగిసిన జి7 శక్తి వనరుల మంత్రుల సమావేశం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత…

క్రిమియాను వదిలేసిన ఉక్రెయిన్, జి8 మీటింగ్ రద్దు

ఉక్రెయిన్ కేంద్రంగా మరో రెండు గుర్తించదగిన పరిణామాలు జరిగాయి. ఒకటి: క్రిమియా నుండి ఉక్రెయిన్ తన సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. రెండు: జూన్ లో రష్యా నగరం సోచిలో జరగవలసిన జి8 శిఖరాగ్ర సమావేశాన్ని జి7 గ్రూపు దేశాలు రద్దు చేశాయి. ఉక్రెయిన్ నుండి పూర్తి స్వాతంత్ర్యం కోరిన తీర్మానాన్ని క్రిమియా ప్రజలు పెద్ద సంఖ్యలో బలపరచడంతో క్రిమియా పార్లమెంటు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ వెంటనే రష్యన్ ఫెడరేషన్ లో సభ్య ప్రాంతంగా…

జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం

శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై ప్రపంచ స్ధాయి ప్రభావం పడుతోంది. జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ గత రెండున్నర సంవత్సరాలలోనే అత్యల్ప స్ధాయికి పడిపోయింది. భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి మళ్ళీ పదాహారు వేల పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,…