మోడి సమక్షంలో కాశ్మీర్ లేని భారతం!

జి20 గ్రూపు దేశాల సమావేశాల నిమిత్తం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో భారత దేశ పటం చిన్నబోయింది. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన వెంటనే క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూ.యు.టి) ని ప్రధాని మోడి సందర్శించగా యూనివర్సిటీ వారు కాశ్మీరు లేని భారత దేశాన్ని మోడి సందర్శనలో ప్రదర్శించారు. ఇదే వ్యవహారం యు.పి.ఏ ఏలుబడిలో జరిగితే హిందూత్వ సంస్ధల గగ్గోలు ఏ స్ధాయిలో ఉండేదో గానీ ఈసారి మాత్రం కిక్కురు మనలేదు.…

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐల నిర్వచనం: సిఫారసులు ఆమోదం

ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల నిర్వచనానికి సంబంధించి మాయారాం కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ), విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐ)… ఈ పదబంధాల నిర్వచనాలను హేతుబద్ధం చేయడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం నేతృత్వంలో ఒక కమిటీని నియమించగా అది శనివారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సదరు నివేదిక చేసిన సిఫారసులను ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం ఈ రోజు (సోమవారం, జూన్ 23) ప్రకటించింది. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లను…

అమెరికా రుణం: తగిన చర్యలు తీసుకోవాలి -జి20

ఇన్నాళ్లూ ప్రపంచ దేశాలకు ఆర్ధిక వ్యవస్ధలను సవరించుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. వాషింగ్టన్ లో సమావేశమైన జి20 దేశాల ప్రతినిధులు ఋణ పరిమితి పెంపుదలపై తగిన చర్యలు తీసుకోక తప్పదని దాదాపు హుకుం జారీ చేసినంత పని చేశాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్ధితిలో తన స్వల్పకాలిక కోశాగార అవసరాలు తీర్చుకోడానికి వెంటనే  తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే గడ్డు పరిస్ధితి రానున్నదని జి20…