అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

జి20 సమావేశాల్లో దేశాల నాయకులపై నిఘా పెట్టిన బ్రిటన్

తమ దేశంలో జి20 సమావేశాలు జరిగినప్పుడు సమావేశాలకు హాజరయిన సభ్య దేశాల నాయకులపై కూడా నిఘా వేసిన దురాగతానికి బ్రిటన్ పాల్పడింది. 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించిన తర్వాత, సంక్షోభ పరిష్కారానికి జి20 కూటమి వరుస సమావేశాలు నిర్వహించింది. 2009లో లండన్ లో జరిగిన జి20 సమావేశాల సందర్భంగా అధునాతమైన టెక్నిక్ లను ఉపయోగించి సభ్య దేశాల తరపున హాజరైన మంత్రులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు వారీ మందీ మార్బలం అందరి ఫోన్ లను, ఈ…

జి20, రియో సభలో మన్మోహన్ బడాయి -కార్టూన్

జి 20, రియో సభల కోసం ప్రధాని మన్మోహన్ వారం రోజుల పాటు ఉత్తర, దక్షిణ అమెరికాలు వెళ్లివచ్చాడు. మెక్సికో లో జి 20 సమావేశాలు జరగ్గా బ్రెజిల్ రాజధాని ‘రియో డి జనేరియో’ లో ‘రియో + 20’ పేరుతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సమావేశాలు జరిగాయి. గ్లోబల్ వార్మింగ్ పై 1992 లో మొదటి సారి ‘ఎర్త్ సమ్మిట్’ పేరుతో రియోలోనే ప్రపంచ దేశాల సమావేశాలు జరిగాయి. మళ్ళీ 20 సంవత్సరాల…

అమెరికాలో ఆరు బ్యాంకుల అధికారులకు చెల్లించిన జీతాలూ, బోనస్ ల మొత్తం కాన్సాస్ రాష్ట్ర జీడీపీ కి సమానం

అమెరికాలో ఫైనాన్స్ సంస్ధలు దోపిడీకి పెట్టింది పేరు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా అది అమెరికా ఆర్ధిక వృద్ధి కోసమే. వాళ్ళవలన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించి అమెరికా, యూరప్ లు అతలాకుతలమైనా అది ప్రపంచ ఆర్ధిక వృద్ధికీ, ప్రపంచ ప్రజల సంతోషం కోసమే. ప్రపంచ ప్రజల సంతోషం కోసం అహోరాత్రాలూ కష్టపడుతున్న బ్యాంకు ఎగ్జిక్యూటివ్ సిబ్బంధికి బ్యాంకులు ఇచ్చే జీతాలూ, బోనస్^లూ, వివిధ సదుపాయాల మొత్తం ఎంతో రాయిటర్స్ సంస్ధ లెక్కేసింది. వాల్ స్ట్రీట్ బ్యాంకుల్లో…

పూర్తిస్ధాయి సంక్షోభానికి ఒకే ఒక్క షాక్ దూరంలోనే ఉన్నాం -ప్రపంచ బ్యాంకు

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ…

బ్రిక్స్ గా మారిన బ్రిక్ కూటమి, జి-7 తో పోటీకి ఉరకలు?

నాలుగు దేశాలు బ్రిక్ కూటమి ఐదు దేశాల బ్రిక్స్ కూటమిగా మార్పు చెందింది. సౌతాఫ్రికా నూతనంగా ఈ కూటమిలో చేరడంతో BRIC కూటమి కాస్తా BRICS కూటమిగా మారింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా లు కలిసి బ్రిక్ కూటమి ఏర్పడింది. ఇప్పటివరకూ ఇది రెండు సమావేశాలను జరుపుకుంది. మూడో సమావేశం సౌతాఫ్రికా తో కలిసి చైనా లోని సాన్యాలో జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలుగా పేరు పొందిన దేశాలు కలిసి ఏర్పాటయిన…