లైంగిక వల, సైబర్ దాడులు… బ్రిటన్ గూఢచర్యం కళలివి

ప్రత్యర్ధి దేశాల ఏజెంట్లను వలలో వేసుకోవడానికీ, టార్గెట్ లను లొంగదీసుకోవడానికి బ్రిటిష్ గూఢచారులు అనేక ‘డర్టీ ట్రిక్స్’ ప్రయోగిస్తారని ఎడ్వర్డ్ స్నోడెన్ పత్రాలు వెల్లడించాయి. అందమైన యువతులను ప్రయోగించి లైంగికంగా ఆకర్షించి వలలో వేసుకోవడం, సైబర్ దాడులతో ప్రత్యర్ధుల ఇంటర్నెట్ కార్యకలాపాలను రికార్డు చేసి బహిర్గతం చేయడం ద్వారా అప్రతిష్టపాలు చేస్తామని బెదిరించడం… ఈ డర్టీ ట్రిక్స్ లో కొన్ని. ప్రత్యర్ధి ఏజంట్లు, హ్యాకర్లు, అనుమానిత టెర్రరిస్టులు, ఆయుధ వ్యాపార డీలర్లు, ఇంకా అనేక ఇతర నేరస్ధులను…

జి20 సమావేశాల్లో దేశాల నాయకులపై నిఘా పెట్టిన బ్రిటన్

తమ దేశంలో జి20 సమావేశాలు జరిగినప్పుడు సమావేశాలకు హాజరయిన సభ్య దేశాల నాయకులపై కూడా నిఘా వేసిన దురాగతానికి బ్రిటన్ పాల్పడింది. 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించిన తర్వాత, సంక్షోభ పరిష్కారానికి జి20 కూటమి వరుస సమావేశాలు నిర్వహించింది. 2009లో లండన్ లో జరిగిన జి20 సమావేశాల సందర్భంగా అధునాతమైన టెక్నిక్ లను ఉపయోగించి సభ్య దేశాల తరపున హాజరైన మంత్రులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు వారీ మందీ మార్బలం అందరి ఫోన్ లను, ఈ…