మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్

“…ప్రారంభోల్లాస భ్రాంతి సర్దుకునే కొలదీ ఆర్ధిక స్ధితిగతులలు తన అసలు రూపాన్ని వ్యక్తం చేసుకుంటుంది..”  (ఆ రూపమే గదిలో ఏనుగు) మోడి: మనం మిత్రులమే కదా? *** స్వతంత్ర  భారత దేశ చరిత్ర లోనే పూర్తి మెజారిటీ సాధించిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బి.జె.పి మన్ననలు అందుకుంటోంది. బి.జె.పికి ఆ ఖ్యాతి దక్కించిన మహోన్నత నేతగా నరేంద్ర మోడి ప్రశంసలు పొందుతున్నారు. నిన్నటిదాకా ‘దూరం, దూరం’ అంటూ అస్పృశ్యత అమలు చేసిన బ్రిటన్, అమెరికాలు ‘రండి,…

భారత వృద్ధి: పరిశ్రమలు బలహీనం, పెట్టుబడులు కరువు

భారత దేశ అభివృద్ధి కధ ఎప్పటికయినా పునరుద్ధరించబడేనా? 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ముందు వరకు సగటున 9 శాతం జి.డి.పి వృద్ధి రేటుతో పశ్చిమ పెట్టుబడులకు చైనా తర్వాత ఫేవరెట్ గా నిలిచిన ఇండియా ఇప్పుడు అందులో సగం వృద్ధి సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. ‘ఫాస్ట్ ట్రాక్’ పేరుతో స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు అనుమతులను భారత చట్టాలను బుల్ డోజ్ చేస్తూ జారీ చేస్తున్నా ఆర్ధిక వ్యవస్ధలో మునుపటి కళ గోచరించడం…

ద్రవ్య సమీక్ష: వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ

ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి మార్కెట్ పరిశీలకులను ఆశ్చర్యపరిచారు. పరిశ్రమ వర్గాలను నిరాశపరిచారు. తాను మాత్రం ‘వినాశకర ద్రవ్యోల్బణం’ పగ్గాలు బిగించే పనిలో ఉన్నానని చెప్పారు. ద్రవ్య సమీక్షలో భాగంగా ఆయన స్వల్పకాలిక వడ్డీ రేటు ‘రెపో రేటు’ ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతం నుండి 8 శాతానికి చేర్చారు. 2013-14 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువే ఉంటుందని చెప్పి ఆర్.బి.ఐ గవర్నర్ మరో…

ప్రశ్న: జి.డి.పి, ప్రపంచీకరణ వగైరా…

కె.బ్రహ్మం: జి.డి.పి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, వృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: బ్రహ్మం గారు ప్రశ్న వేసి దాదాపు రెండు వారాల పైనే అయింది. ఇంకా ఐదారుగురు మిత్రులకు నేను సమాధానం బాకీ ఉన్నాను. ఆలస్యానికి విచారిస్తున్నాను. బ్రహ్మం గారి ప్రశ్నకు మొదట సమాధానం ఇస్తున్నాను. జి.డి.పి: Gross Domestic Product అనే పదబంధానికి జి.డి.పి పొట్టిరూపం. తెలుగులో స్ధూల జాతీయోత్పత్తి అని అంటారు. స్ధూల దేశీయోత్పత్తి అన్నా…

వడ్డీ రేటు పెంచిన ఆర్.బి.ఐ, ప్రభుత్వం కినుక

ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన…

కంచి దారిలో ఇండియా జి.డి.పి వృద్ధి కధ!

దేశ వనరులన్నీ తవ్వి తీసి దేశ ప్రజలకు వినియోగపెట్టడం మాని విదేశాలకు ఎగుమతి చేయడమే అభివృద్ధిగా చెప్పుకున్న భారత పాలకుల అభివృద్ధి కధ కంచి దారి పట్టినట్లు కనిపిస్తోంది. 2012-13 సంవత్సరానికి గాను దశాబ్ద కాలంలోనే అత్యంత తక్కువ జి.డి.పి వృద్ధి రేటును భారత ఆర్ధిక వ్యవస్ధ నమోదు చేసింది. మాన్యుఫాక్చరింగ్, సేవలు, వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం తదితర ముఖ్యమైన అన్ని రంగాలలోనూ వృద్ధి రేటు కుంటుబడడంతో గత ఆర్ధిక సంవత్సరం…

చైనా 2016కల్లా అమెరికాను దాటిపోతుంది -ఒఇసిడి

2016 నాటికి చైనా ఆర్ధిక వ్యవస్థ ‘పర్చేసింగ్ పవర్ ప్యారిటీ’ (పి.పి.పి) పరంగా అమెరికాను మించిపోతుందని ఒఇసిడి (Organization for Economic Cooperation and Development) జోస్యం చెప్పింది. వరుసగా నాలుగో దశాబ్దంలో వేగవంతమైన ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) నమోదు చేయడానికి చైనా ఉరుకులు పరుగులు పెడుతోందని ఒఇసిడి విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. గత సంవత్సరం జపాన్ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని మించి పోయి అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక…

బడ్జెట్ 2013-14: వేతన జీవులకు 2000/- ముష్టి

ఆర్ధిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్ లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాసింత ముష్టి విదిలించి మధ్య తరగతి ప్రజల పట్ల తనకు ఉన్న ఔదార్యం చాటుకున్నాడు. సంవత్సరానికి రు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రు. 2,000/- పన్ను చెల్లింపులో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే మొదటి పన్ను శ్లాబ్ ను రు. 2 లక్షల నుండి 2.2 లక్షలకు పెంచినట్లు అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇది పరిమితి పెంపు కాదు. ప్రభుత్వమే ఆయా…

నరేంద్ర మోడి అభివృద్ధి బండారం ఇంకోసారి

దేశంలో మిగతా రాష్ట్రాలకంటే గుజరాత్ అభివృద్ధిపధంలో దూసుకెళుతోందనీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సమర్ధతే దానికి కారణమనీ పత్రికలు భజన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో వాస్తవం ఏమిటో ‘గుజరాత్ అభివృద్ధి కధ‘ పేరుతో ఈ బ్లాగ్ లో ఓ ఆర్టికల్ రాయడం జరిగింది. గుజరాత్ లో జరిగిందంటున్న అభివృద్ధి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులదే తప్ప అక్కడి ప్రజలది కాదని అందులో తెలియజేశాను. మరికొన్ని వివరాలు ఇపుడు చూద్దాం. వారపత్రిక అయిన తెహెల్కా నవంబరు…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -2

(మొదటి భాగం తరువాయి…) వేతనాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదా, వేతనాలు ఇవ్వడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ విషయం చూద్దాం. ప్రొఫెసర్ డాక్టర్. ఇందిరా హిర్వే, అహ్మదా బాద్ లోని ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్’ సంస్ధకు డైరెక్టర్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 27 న ‘ది హిందూ’ లో రాసిన ఆర్టికల్ లో గుజరాత్ అభివృద్ధి గురించి ఆమె చర్చించారు. గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రంగాల్లో పని చేస్తున్న…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1

నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి…