ఉత్పత్తి పడిపోయింది, బాధ్యత ఎవరిది?

జులై నెలలో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. గత నాలుగు నెలల్లో అతి తక్కువ పెరుగుదల శాతం (0.5 శాతం) నమోదయింది. 2014-15 మొదటి త్రైమాసిక సంవత్సరంలో జి.డి.పి వృద్ధి రేటు 5.7 శాతం నమోదు కావడానికి కారణం మేమంటే మేమేనని తగవులాడుకున్న మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం, ప్రస్తుత పట్టణ మంత్రి వెంకయ్య నాయుడు గార్లు తాజా ఫలితానికి కూడా క్రెడిట్/డెబిట్ తీసుకుంటారా? మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి పడిపోవడం, వినియోగ సరుకులు తక్కువగా అమ్ముడుబోవడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి…

జి.డి.పి వృద్ధి: కాదు కాదు, మా వల్లే -వెంకయ్య

10 త్రైమాసికాల తర్వాత మొట్ట మొదటిసారిగా 2014-15 మొదటి త్రైమాసికంలో భారత ఆర్ధిక వృద్ధి రేటు 5.7 శాతం నమోదు చేసింది. ఇది తమ విధానాల వల్లనే అని మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం మొన్న జబ్బ చరుచుకున్న సంగతి విదితమే. చిదంబరం సంతోషానికి బి.జె.పి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ నేత అంతగా సంతోషపడడానికి ఏమీ లేదని జి.డి.పి తమ బి.జె.పి ప్రభుత్వం వల్లనే పెరిగిందని పోటీకి వచ్చారు. తాము అధికారంలోకి…

Q1 వృద్ధి మా వల్లనే -చిదంబరం

2014-15 ఆర్ధిక సం.లో మొదటి త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్ 2014) లో భారత ఆర్ధిక వ్యవస్ధ 5.7 శాతం వృద్ధి నమోదు చేసింది. గత రెండున్నరేళ్ల కాలంలో ఇదే అత్యధిక జి.డి.పి వృద్ధి శాతం. మెరుగైన జి.డి.పి వృద్ధి కోసం మొహం వాచిపోయి ఉన్న భారత పాలకులు ఈ 5.7% అంకెను చూసి సంబరాలే తక్కువ అన్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. మోడి వల్లనే ఇది సాధ్యం అయిందని బి.జె.పి నాయకులు చెప్పుకుంటుండగా, కాదు తమ వల్లనే…