రోదసీలోకి భారతీయుడు: మార్క్ 3 ద్వారా ముందడుగు

రోదసీ ప్రపంచంలోకి భారతీయుడు ప్రవేశించే దూరం దగ్గరలోనే ఉన్నదని నేడు ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి – మార్క్ III ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా రుజువయింది. రాకెట్ ద్వారా మనుషులు కూర్చుని ఉండే మాడ్యూల్ ను రోదసీలోకి ప్రయోగించిన అనంతరం సదరు మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే ప్రయోగాన్ని LVM3/CARE ప్రయోగం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించి చూశారు. మాడ్యూల్ సురక్షితంగా భూవాతావరణంలోకి ప్రవేశించడమే కాకుండా అనుకున్న చోటనే బంగాళాఖాతంలో దిగడంతో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు…