ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు

గత రెండు మూడేళ్ళుగా ఇండియాను పీడిస్తున్న ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం కొత్త వైద్యం ప్రకటించింది. గతంలో ప్రకటించిన కారణాలు, వాటికి ప్రతిపాదించిన వైద్యాలు ఇప్పటివరకూ ఏవీ పని చేయలేదు. అదిగో తగ్గుతుంది, ఇదిగో తగ్గింది అనడమే తప్ప ద్రవ్యోల్బణం తగ్గించి ప్రజలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే ఆచరణాత్మక కార్యక్రమం ఇంతవరకు చేపట్టింది లేదు. ఎంతసేపూ జిడిపి వృద్ధి రేటు తప్ప మరో ధ్యాస లేని ప్రభుత్వానికి ఆ జిడిపి వృద్ధి పైనే అంతర్జాతీయ సంస్ధలు భారత ప్రభుత్వానికి షాకిచ్చాయి.…

జపాన్ ను అధిగమించి రెండో స్ధానానికి చేరిన చైనా అర్ధిక వ్యవస్ధ

చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. రెండవ స్ధానంలో ఉన్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి చైనా రెండో స్ధానం లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 2010 సెప్టెంబరు నాటికే చైనా జపాన్ ను అధిగమించింది. వార్తా సంస్ధలు ఎందుకనో అప్పట్లో పట్టించుకోలేదు. 2010 డిసెంబరుతో చైనా ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు ఆర్ధిక సంవత్సరం క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఆర్ధిక సంవత్సరం ముగిసాక చైనా…