వెచ్చగా ఉంచమంటే మంటలు రగిలించాడు -కార్టూన్

బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝి సంప్రదాయానికి విరుద్ధంగా పోయి గొప్ప చిక్కుల్నే తెచ్చి పెట్టారు. చిక్కులు ఎవరికి అన్నది కొద్ది రోజుల్లో తేలవచ్చు, ఇప్పటివరకు చూస్తే మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ చిక్కులు ఎదుర్కొంటున్నారు. మంఝిని నమ్మి ముఖ్యమంత్రి పీఠం అప్పజెపితే ఆయన మోసం చేశారని నితీష్ ఫిర్యాదు చేయవచ్చు గానీ, నిజానికి సి.ఎం సీటులో కూర్చోబెట్టడానికి గానీ, దిగిపొమ్మనడానికి గానీ ఆయనెవరు? లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తీసుకుని రాజీనామా చేసిన…