డీమానిటైజేషన్: పడిపోయిన ఇండియా జి‌డి‌పి

2016-17 సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి గణనీయంగా పడిపోయింది. 8 శాతం పైగా నమోదు చేస్తుందని ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వం, ఆర్‌బి‌ఐ, ఆర్ధిక సలహాదారులు అంచనా వేయగా 7 శాతం మాత్రమే నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు తెలిపాయి. డీమానిటైజేషన్ వల్ల భారత ఆర్ధిక వృద్ధి రేటు పడిపోతుందన్న పలువురు నిపుణుల అంచనాలు నిజం కాగా ప్రభావం పెద్దగా ఉండబోదన్న కేంద్ర ప్రభుత్వ అంచనా తప్పింది. గడచిన ఆర్ధిక సంవత్సరం (2016-17) నాలుగవ త్రైమాసికంలో (జనవరి…

Q1 జిడిపి వృద్ధిలో చైనా, ఇండియాలను కిందికి తోసిన టర్కీ, అర్జెంటీనా

2011 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో చైనా, ఇండియాలు జిడిపి వృద్ధికి సంబంధించి తమ స్ధానాలను కోల్పోయాయి. వాటి స్ధానాలను టర్కీ, అర్జెంటీనాలు ఆక్రమించాయి. ఇప్పటివరకూ చైనా, ఇండియాలో జిడిపి వృద్ధి రేటులో ప్రపంచంలో మొదటి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇంతవరకూ అవి తమ స్ధానాలను కాపాడుకుంటూ వచ్చాయి. మొదటి క్వార్టర్ జిడిపి వృద్ధి రేటులో మొదటి ఐదు స్ధానాల్లో ఉన్న దేశాలను కింది పట్టికలో చూడవచ్చు.…

ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్

రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో…

అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రికార్డు ఆర్ధిక వృద్ధి నమోదు చేసిన చైనా

అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ ధరలు, అధిక ధరలు అన్నింటినీ అధిగమిస్తూ చైనా అర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో 9.5 ఆర్ధిక వృద్ధిని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆర్ధికవేత్తలు, మార్కెట్ విశ్లేషకుల అంచనా 9.4 శాతం అంచనాని దాటి చైనా అర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందటం గమనార్హం. చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తూన్నదన్న భయాలను ఈ దెబ్బతో చైనా పటాపంచలు చేసినట్లయింది. తాజా ఆర్ధిక వృద్ధి రేటుతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి…

మరింత క్షీణించిన భారత మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి

ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి జూన్ నెలలో కూడా క్షీణించడం కొనసాగింది. జూన్ నెలలో మాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి తొమ్మిద నెలల కనిష్టస్ధాయిలో నమోదైందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుండడం వలన అప్పు సేకరణ ఖరీదు పెరగడంతో దాని ప్రభావం మాన్యుఫాక్చరింగ్ రంగంపై పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్.ఎస్.బి.సి బ్యాంకు నిర్వహించే పి.ఎమ్.ఐ సూచిక (Purchasing Managers’ Index) ప్రకారం మే నెలలో పి.ఎమ్.ఐ సూచి 57.5 నమోదు చేయగా జూన్ నెలలో అది…