ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు

ఢిల్లీ పోష్ లోకాలిటీ ‘వసంత్ కుంజ్’ లో ఒక మైనర్ బాలిక ను పనిలో పెట్టుకుని హింసించిన కేసులో నిందితురాలికి కోర్టు బెయిలు నిరాకరించింది. నోయిడాలో ఒక పేరు పొందిన బహుళజాతి సంస్ధలో కమ్యూనికేషన్ విభాగాని అధిపతిగా పని చేస్తున్న వందన ధీర్ కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల జార్ఖండ్ బాలిక ఆర్తనాదాలు విని పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ, పోలీసుల సాయంతో బాలిక…

లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు

లతెహార్ ఎన్ కౌంటర్ లో గిరిజనులను పోలీసులు బలవంతం చేసి మానవ కవచంగా వాడుకున్నారని ‘ది హిందూ‘ పరిశోధనలో వెల్లడయింది. మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన పోలీసుల శవాలను వెతికే పనిలో గ్రామ ప్రజలను మానవ కవచంగా పోలీసులు వినియోగించడంతో నలుగురు గిరిజనులు దుర్మరణం చెందారు. పోలీసులు మరణించిన తమ సహచరుడి శవానికి ఇరవై అడుగుల దూరంలోనే నిలబడి శవాన్ని తేవడానికి గిరిజనులను పంపించడంతో పేలుడునుండి పోలీసులు తప్పించుకోగా గిరిజనులు చనిపోయారు. శవాన్ని తన భుజానికి ఎత్తుకుంటూ శవం…