ఇమాం మద్దతుకు ఎఎపి తిరస్కరణ!

ఢిల్లీ ఎన్నికలపై బి.జె.పి పెట్టుకున్న ఆశల్ని ఎఎపి వమ్ము చేసేట్లే ఉంది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఢిల్లీ ఇమాం మద్దతు కోసం ఎదురు చూస్తుంటే ఆ ఇమామే ఎదురొచ్చి మద్దతు ఇస్తానంటున్నా ‘వద్దు, పొమ్మని’ ఎఎపి తిరస్కరించింది. ఫలితంగా, ఢిల్లీ ఓటర్లను మత ప్రాతిపదికన చీల్చే అమూల్య అవకాశం బి.జె.పికి దూరం అయింది. జామా మసీదు షాహీ ఇమాం సయ్యద్ బుఖారి ఇటీవల ఎఎపి పార్టీకి మద్దతు ప్రకటించారు. ఎఎపి కోరనప్పటికీ ఆయనే స్వయంగా ముందుకు వచ్చి…