అణు ఒప్పందం పురోగతిపై అమెరికా నిస్పృహ!?

2008లో ఇండియా, అమెరికాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం ఎటువంటి పురోగతి లేకుండా స్తంభించిపోవడం పట్ల అమెరికా నిస్పృహగా ఉందిట. అంతర్జాతీయ అణు ఏకాకితనం నుండి ఇండియాను బైటపడేసినా అమెరికాకు ఇంతవరకూ పైసా ప్రయోజనం లేకపోవడం అమెరికా నిస్పృహకు కారణం. కానీ ఈ వ్యవహారంలో దోషులు ఎవరన్న విషయంలో అమెరికా అమాయకత్వం నటించడమే ఆశ్చర్యకరం. అణు రియాక్టర్, తదితర అణు పరికరాలు లోప భూయిష్టమైనవి సరఫరా చేసినందువల్ల అణు ప్రమాదం సంభావిస్తే అందుకు ఆ పరికరాలు అమ్మిన కంపెనీ…

యుద్ధోన్మాది మెక్ కెయిన్ ఇండియా పర్యటన

కరడు గట్టిన యుద్ధోన్మాది, అమెరికా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఇండియా పర్యటన కోసం వేంచేశారు. దేవయాని ఖోబ్రగదే వ్యవహారం వల్ల చెడిన ఇండియా-అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించడానికి మెక్ కెయిన్ పర్యటన ఉద్దేశించబడింది. మెక్ కెయిన్ రాకకు మునుపు బి.జె.పి పార్టీపై గూఢచర్యం నిర్వహించడానికి అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనుమతి సంపాదించిందన్న సమాచారాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పటికీ అమెరికాతో దృఢమైన సంబంధాల పెంపుదలకు మోడి ప్రభుత్వానికి ఏమీ ఆటంకం కాలేకపోయింది.…

సిరియా: 2 రోజులు కాదు, ఉధృత దాడికే సెనేట్ కమిటీ ఆమోదం

శాంతి కపోతం ఇప్పుడు ఇనప రెక్కల్ని తొడిగిన డేగగా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతిని బారక్ ఒబామాకు ఇచ్చినందుకు నోబెల్ కమిటీ సిగ్గుపడుతున్నదో లేదో గానీ సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మాత్రం ఖచ్చితంగా మరోసారి చనిపోయి ఉంటాడు. మొదట రెండు రోజుల పరిమిత దాడి అని చెప్పిన ఒబామా ఆ తర్వాత సెనేట్ కమిటీలో చర్చకు పెట్టకుముందే

సిరియాపై దుస్సాహసానికి అమెరికా ఏర్పాట్లు?

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాల వరుసలో సిరియాను చేర్చడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రక్షణ కార్యదర్శి చక్ హెగెల్ (మన మంత్రితో సమానం) చెబుతున్న మాటలు నిజమే అయితే సిరియాపై దాడి చేయడానికి అమెరికా తన యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగు యుద్ధ నౌకలు సిరియా జలాలకు సమీపంలోకి తరలిస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రెండు రోజుల క్రితం చెప్పిన మాటలను…