రష్యా జెట్ ని కూల్చే వాళ్ళమే -జాన్ కెర్రీ

అమెరికా పాలకుల రష్యా వ్యతిరేక మేనియా (పిచ్చి) కొనసాగుతోంది. రష్యా ఫైటర్ జెట్ ఒకటి తమ యుద్ధ నౌకకు ప్రమాదకర రీతిలో సమీపంగా చక్కర్లు కొట్టి వెళ్లిందని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఆరోపించాడు. “అమెరికా యుద్ధ నౌక వద్ద రొద పెడుతున్న రష్యా జెట్ విమానాన్ని (కాస్త ఉంటే) కూల్చేసే వాళ్ళమే” అని ఆయన బహిరంగంగానే ఎటువంటి శశభిషలు లేకుండా బెదిరింపు జారీ చేశాడు. పోలండ్, అమెరికాల మిలట్రీ బలగాలు పోలండ్ తీరంలో విన్యాసాలు…

శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2

చైనా, శ్రీలంకల మధ్య వాణిజ్యం ఏటికేడూ పెరుగుతూ పోతోంది. 2013లో ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్లు దాటింది. శ్రీలంకకు దిగుమతులు ఇండియా తర్వాత చైనా నుండే ఎక్కువ వస్తాయి. కానీ శ్రీలంక ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే చైనాకు వెళ్తాయి. ఫలితంగా శ్రీలంకకు చైనాతో భారీ వాణిజ్య లోటు (2012లో 2.4 బిలియన్ డాలర్లు) కొనసాగుతోంది. త్వరలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవని పరిశీలకులు అంచనా వేస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. ఈ…

మోడిని ప్రసన్నం చేసుకోలేని కెర్రీ? -కార్టూన్

అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చి వెళ్లారు. మోడి రాక కోసం తమ అధ్యక్షుడు బారక్ ఒబామా ఆత్రంగా ఎదురు చూస్తున్నారన్న సందేశాన్ని మోసుకొచ్చిన కెర్రీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా మోడీ ముందు వ్యవహరించారని కార్టూన్ సూచిస్తోంది. దేవయాని ఖోబ్రగదేను అమెరికాలో అరెస్టు చేసినప్పటి నుండి ఇరు దేశాల సంబంధాలు క్షీణ దశలో ఉన్నాయని పత్రికలు చెప్పే మాట. మోడి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

దేవయాని అరెస్టుకు ముందు అమెరికా ఎంబసీలో ఏం జరిగింది?

న్యూయార్క్ లో భారత (మాజీ) డిప్యూటీ కాన్సల్ జనరల్  దేవయాని ఖోబ్రగదే పై మోపిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఇండియా డిమాండ్ చేస్తోంది. వీసా ఫ్రాడ్ కేసును అమెరికా కొనసాగించరాదని, కేసును వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదని భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ బుధవారం తనకు ఫోన్ చేశారని కానీ ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆయన తెలిపారు. అయితే ఇది నిజం…

ఇంటర్నెట్ గూఢచర్యం: నిజమే, అతిగా చేశాం -అమెరికా

అన్ని వైపుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అమెరికా తన తప్పును పరిమితంగానే అయినా అంగీకరించింది. కొన్ని కేసుల్లో అతిగా గూఢచర్యం నిర్వహించామని, వాటిని సవరించుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ ఒప్పుకున్నాడు. కానీ తాము అమాయకులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చాడు. జర్మనీ ఛాన్సలర్, భారత ప్రధాన మంత్రిలతో సహా 35 దేశాల అధిపతుల ఫోన్ సంభాషణలను రికార్డు చేసినందుకు అన్నివైపుల నుండి దాడి, ఒత్తిడి తీవ్రం ఐన నేపధ్యంలో ఈ…

అనూహ్య పరిణామం: సిరియాపై వెనక్కి తగ్గిన అమెరికా

నిత్యం పెనం మీద కాలుతుండే మధ్యప్రాచ్యం (Middle-East) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, ఊహించని రీతిలో సిరియా ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు చర్చలు జరగడానికి అంగీకరించాడు. అధ్యక్షుడు బషర్ అస్సద్ గద్దె దిగితే తప్ప చర్చలు సాధ్యం కాదని హుంకరిస్తూ వచ్చిన అమెరికా, చర్చలకు అంగీకరించడం ప్రపంచంలో బలా బలాలు మారుతున్నాయనడానికి మరో ప్రబల సంకేతం. అమెరికా, ఐరోపాల ప్రాభవ క్షీణతలో మరో అధ్యాయానికి…

పాక్‌తో సంబంధాల మెరుగుకు అమెరికా ప్రయత్నాలు

సి.ఐ.ఏ ఏజెంట్ డేవిస్ అప్పగింత, ఒసామా బిన్ లాడెన్ హత్య లతో పాక్, అమెరికాల మధ్య అడుగంటిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దాన్లో భాగంగా సెనేటర్ జాన్ కెర్రీ ఆఫ్ఘన్, పాక్ లలో పర్యటిస్తున్నాడు. వచ్చింది సంబంధాల మెరుగుకే అయినా పాక్ పై నిందలు మోపడం మానలేదు. ఒసామా బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు పాక్ లో ఉండటానికి పాక్ సంస్ధల సాయం ఉందన్న విషయం నమ్మకాన్ని చెదరగోట్టేదని కెర్రీ ఆఫ్ఘనిస్ధాన్ లో…