ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్పణం ఈ ఫోటో

ఆ కనిపించే గోడ ఇజ్రాయెల్ తన ప్రాంతాల చుట్టూ నిర్మించిన కట్టడం. కోట కోడను తలపించే ఇలాంటి ఎత్తైన గోడలు ఇజ్రాయెల్ నిండా దర్శనమిస్తాయి. అవి ఇజ్రాయేలీయులు (యూదులు), పాలస్తీనీయులు నివసించే ప్రాంతాలను వేరు చేస్తాయి. పనులకు వచ్చే పాలస్తీనీయులను శల్య పరీక్ష చేయడానికి కూడా చెక్ పోస్టుల వద్ద ఇలాంటి ఎత్తైన గోడలను ఇజ్రాయెల్ నిర్మించింది. ఇలాంటి చెక్ పోస్టుల వద్ద ‘క్యూ’లలో ఇజ్రాయెల్ సైనికుల చేత నఖశిఖ పర్యంతం చెకింగ్ అయ్యాకనే పాలస్తీనీయులకు ఆ…

ఇంగ్లండులో భారతీయ విద్యార్ధి హత్య, రేసిజమే కారణం?

విహార యాత్రకి వెళ్ళిన భారతీయ విద్యార్ధి ఇంగ్లండులో హత్యకు గురయ్యాడు. లాంకాస్టర్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ లో పి.జి చదువుతున్న ఇరవై మూడేళ్ళ విద్యార్ధి సాల్ ఫోర్డ్ (గ్రేటర్ మాంఛెస్టర్) సందర్శనకు వెళ్ళగా అక్కడ ఓ బ్రిటిష్ వ్యక్తి దగ్గరినుండి కాల్చి చంపాడు. సంఘటన సోమవారం తెల్లవారు ఝాముల జరిగింది. పోలీసులు ఈ ఘటన రెచ్చగొట్టబడిన కారణాలు ఏవీ లేకుండానే జరిగిందని చెప్పారు. అయితే జాతి విద్వేషంతో ఈ హత్య జరిగిందా, లేదా అని చెప్పడానికి వారు…

కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం, మరిన్ని సెటిల్‌మెంట్ల నిర్మాణానికి ఆమోదం

ఓవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాలస్తీనా దేశ ప్రకటనపై తీవ్రమైన చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంలో ఇజ్రాయెల్ దేశస్ధులకు కొత్త సెటిల్‌మెంట్లు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజాన్ని పరిహసించడం ఇజ్రాయెల్ కు ఇది కొత్త కాదు. ఐక్యరాజ్య సమితితో ఇజ్రాయెల్ వ్యవహారం అంతా మొదటినుండీ జాత్యహంకార పద్ధతుల్లోనే ఉంటూ వచ్చింది. 1967 యుద్ధంలో పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంపై ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు నిర్మించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అమెరికా నుండి శ్రీలంక…