అస్సాంలో మళ్ళీ హింస, 70 మంది బలి

అస్సాం రాష్ట్రంలో, ముఖ్యంగా బోడో స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. బోడో మిలిటెంట్ సంస్ధల్లో ఒకటయిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ [ఎన్‌డి‌ఎఫ్‌బి(ఎస్)] కు చెందిన మిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు. అత్యధికంగా స్త్రీలు, పిల్లలు చనిపోయిన హత్యాకాండలో 67 మంది ఆదివాసీ పౌరులు చనిపోగా, పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు ఆదివాసీలు చనిపోయారు. బోడో హత్యలకు ప్రతీకారంగా ఆదివాసీలు కొందరు బోడోల ఇల్లు తగలబెట్టారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం అస్సాంలోని ఇతర…

ఈశాన్య వలసలతో మండుతున్న దేశం, పట్టని ప్రభుత్వాలు -విశ్లేషణ

దాదాపు దేశంలోని అన్నీ ప్రాంతాల నుండీ ఈశాన్యీయులు పెద్ద సంఖ్యలో ఇళ్లకు తిరిగి వెళుతున్నా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుండి చర్యలు కరువయ్యాయి. ‘మీకేం భయం లేదు, ఉన్న చోటనే ఉండండి’ అంటూ ప్రభుత్వాలు ఇస్తున్న నోటి మాటల వాగ్దానాలు వారిలో ధైర్య, స్ధైర్యాలను నింపలేకపోతున్నాయి. అక్కడక్కడా పారామిలిటరీ బలగాల చేత ఒకటి రెండు సార్లు కవాతు చేయించినా, రాష్ట్రాల  హోమ్ మంత్రులు పత్రికల్లో, చానెళ్లలో కనబడి హామీలు గుప్పిస్తున్నా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ తమ…