ఛలో అసెంబ్లీ, గోమాతకు మిలిటరీ దుస్తులు తొడిగి.. -కార్టూన్
వారెవా! కార్టూనిస్టుకి సలాం చేయకుండా ఎవరైనా నిభాయించుకోగలరా?! ‘సర్జికల్ స్ట్రైక్స్’ అంటూ దేశంలో రెచ్చగొట్టిన ఉన్మాదానికి అసలు లక్ష్యం ఏమిటో కార్టూన్ ప్రతిభావంతంగా చాటుతోంది. బహుశా ఈ తరహా కార్టూన్ ఒక కేశవ్ కే సాధ్యం అనుకుంటాను. మోడి అధికారం చేపట్టినాక జాతీయవాదం లేదా జాతీయత అన్న వ్యక్తీకరణలకి అర్ధం పూర్తిగా మారిపోయింది. జాతి అంటే జనులు అన్న సామాన్య అర్ధం గంగలో కలిసిపోయింది. దేశం అంటే ప్రజ అన్న ఉదాత్త భావన ఉన్మాదపూరిత నినాదాలతో కల్తీ…