అమెరికా నిరంతర ఆరాటం -ది హిందు ఎడిటోరియల్

[America’s perennial angst శీర్షికన మే 2 నాటి ది హిందులో ప్రచురితం అయిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్] ఆర్ధిక అగ్రరాజ్యం అయినప్పటికీ దరిద్రం, వెలివేత, నేరాలు… మొ.న అంశాలతో ముడివేయబడిన తీవ్ర స్ధాయి స్వదేశీ సమస్యలు అమెరికాను పట్టి పీడిస్తున్న సంగతిని ఇటీవల బాల్టిమోర్ లో నిరసనలుగా ప్రారంభమై అల్లర్లుగా రూపుదాల్చిన ఆందోళనలు పట్టిచ్చాయి. గత ఏప్రిల్ నెలలో నగర పోలీసుల చేతుల్లో ఒక ఆఫ్రికన్-అమెరికన్ యువకుడు, ఫ్రెడ్డీ గ్రే, ప్రాణాలు కోల్పోయిన…

మరో ‘వైట్’ హంతకుడికి ‘విముక్తి’ -ఫోటోలు

మరో వైట్ పోలీసు ఆధిపత్యం, మరో నల్లజాతి పౌరుడి హత్య, చివరికి మరో గ్రాండ్ జ్యూరీ గుడ్డి తీర్పు! గత జులైలో డ్రగ్స్ అమ్ముతున్నాడని అనుమానంతో పోలీసులు ఓ నల్లజాతి పౌరుడిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. అతడి గొంతు చుట్టూ చేయి బిగించి పట్టుకుని బరబరా పోలీసు వ్యాన్ దగ్గరికి ఈడ్చుకెళ్లారు. మరో ముగ్గురు, నలుగురు పోలీసులు గొంతు బిగించిన పోలీసుకు సహకరించారు. ఈడ్చుతున్నప్పుడే ఆ బాధితుడు అరుస్తూనే ఉన్నాడు, ‘నాకు ఊపిరి అందడం లేదు’ అని.…

జాతివివక్ష: ఆందోళనల సుడిలో అమెరికా -ఫోటోలు

ఫెర్గూసన్ పోలీసు కాల్పుల్లో నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన కేసులో నిందితుడైన తెల్లజాతి పోలీసుపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. తెల్లజాతి సభ్యులే 75 శాతం స్ధానాల్ని ఆక్రమించి ఉండే గ్రాండ్ జ్యూరీ తెల్లజాతి పోలీసుకు అనుకూలంగా వ్యవహరించిందని అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఫలితంగా గ్యాండ్ జ్యూరీ తీర్పుకు వ్యతిరేకంగా అమెరికా అంతటా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. నల్లజాతి అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ యంత్రాంగం వివక్షా రహితంగా వ్యవహరించబోదని ఫెర్గూసన్…

కన్నడం మాట్లాళ్లేదని ఈశాన్యీయులను చావబాదారు

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా భారత దేశంలో జాతి విద్వేషం (రేసిజం) లేదని గర్వంగా చెబుతుంటారు. (తద్వారా జాతి విద్వేషాన్ని తలదన్నే కులవివక్ష ఉనికిని నిరాకరిస్తారు.) ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షతో పాటు భాషా వివక్ష కూడా అమలు చేయవచ్చని బెంగుళూరులోని ముగ్గురు భాషా పరిరక్షకులు చాటారు. తద్వారా జాతి వివక్షలోని ఒక వింత రూపాన్ని ఆవిష్కరించారు. మంగళవారం రాత్రి బెంగుళూరులోని ఒక హోటల్ లో జరిగిందీ ఘటన. బెంగుళూరు (నార్త్-ఈస్ట్) డి.సి.పి వికాస్ కుమార్ ప్రకారం…

ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి…

డిప్రెషన్ బాధితురాలిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు -ఫోటోలు

ఆమె డిప్రెషన్ బాధితురాలు. సంవత్సరంన్నర వయసు పాపకు తల్లి. డెంటల్ హైజీన్ నిపుణురాలు. బాలింతలకు వచ్చే డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ వల్లనే యేమో అక్టోబర్ 3 తేదీన వాషింగ్టన్ కేపిటల్ హిల్ ఏరియాలో వేగంగా కారు నడుపుతోంది. అధ్యక్ష భవనం దరిదాపుల్లో ఇలా ఓ కారు వేగంగా వెళ్ళడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ఒక పోలీసు కారును పక్కకు మళ్లించి ఆపాలని కోరాడు. ఆమె ఆగలేదు. ఇక మొదలైంది వేట. పోలీసులు వీరావతారం ఎత్తారు. కారును…

అమెరికా: తుపాకులు పట్టుకు తిరిగేవారిలో తెల్లవారే ఎక్కువ

న్యూయార్క్ నగరంలో నల్లవారి కంటే తెల్లవారే ఎక్కువగా తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారని న్యూయార్క్ పోలీసుల సర్వేలో తేలింది. నేరం జరిగినప్పుడల్లా నల్లవారిని అనుమానించే న్యూయార్క్ పోలీసుల ధోరణిలో తీవ్ర తప్పిదం ఉందని దీని ద్వారా స్పష్టం అవుతోంది. న్యూయార్క్ పోలీసులు గత రెండు మూడు సంవత్సరాలుగా పాటిస్తున్న stop-and-frisk ఆపరేషన్లలో సేకరించిన డేటా ద్వారా నల్లవారి కంటే రెట్టింపు సంఖ్యలో తెల్లవారి దగ్గరే ఆయుధాలు లభ్యమయ్యాయని రష్యా టుడే తెలిపింది. న్యూయార్క్ పోలీసుల స్టాప్-అండ్-ఫ్రిస్క్ ఆపరేషన్ పలు…

నో ఇండియన్స్ ప్లీజ్! -ఆస్ట్రేలియాలో ఉద్యోగ ప్రకటన

భారతీయులు గానీ, ఆసియన్లు గానీ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించిన ఒక ‘ఉద్యోగ ప్రకటన’ ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సూపర్ మార్కెట్ లో క్లీనర్ ఉద్యోగాల కోసం ‘గమ్ ట్రీ’ (Gumtree) వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఇండియన్లు, ఆసియన్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయనవసరం లేదని పేర్కొంది. ఈ ప్రకటన పట్ల సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఆగ్రహం వ్యక్తం అయింది. ప్రకటన జారీ చేసిన ‘కోల్స్’ సూపర్ మార్కెట్ స్టోర్ ను ప్రజలు బహిష్కరించాలని…

భారతీయ నటి నటించిన “మిరాల్” ప్రీవ్యూని రద్దు చేయాలి -ఇజ్రాయెల్ డిమాండ్

“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్”  పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది. జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ…

వెస్ట్ బ్యాంక్ లో కొత్త సెటిల్మెంట్ నిర్మాణానికి ఇజ్రాయెల్ ఆమోదం

1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగం “వెస్ట్ బ్యాంక్” లో మరో కొత్త సెటిల్మెంటు నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ శనివారం ఈ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. భవిష్యత్ లో జరిగే ఎటువంటి శాంతి ఒప్పందంలో నైనా తన ఆధీనంలో ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్న భూభాగం పైనే కొత్త సెటిల్మెంట్ నిర్మానం జరుగుతుందని ఆ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు ఖండించారు. “ఈ నిర్ణయం…