రహస్య చట్టంతో నల్ల డబ్బు ఖాతాలను దాయొద్దు! -సుప్రీం

మంగళవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. నల్ల డబ్బు ఖాతాల వివరాలను దాచి పెట్టడానికి గోప్యతా నిబంధనలను (confidentiality clause) అడ్డం పెట్టవద్దని ఘాటుగా సూచించింది. నల్ల డబ్బు యాజమానుల వివరాలను వెల్లడించకుండా ఉండడానికి గోప్యతా నిబంధనలను శరణు వేడడం తగదని, ఎన్ని రహస్య నిబంధనలు ఉన్నప్పటికీ నల్ల డబ్బు ఖాతాల పేర్లన్నీ తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారిని ఏంచేయాలో తాము చూసుకుంటామని ప్రభుత్వానికి హైరానా అవసరం లేదని స్పష్టం చేసింది.…