జస్టిస్ వర్మ ఇక లేరు

జ్యోతి సింగ్ పాండే అలియాస్ నిర్భయ పై జరిగిన పాశవిక సామూహిక అత్యాచార, హత్యోదంతం అనంతరం భారత దేశ న్యాయ వ్యవస్ధకు బాధ్యతాయుతమైన రీతిలో ప్రాతినిధ్యం వహించిన జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ సోమవారం మరణించారు. నిర్భయ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్ జె.ఎస్.వర్మ రికార్డు సమయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రజల సమస్యల పట్ల అధికార వ్యవస్ధ స్పందించవలసిన తీరుకు ఒక ఉదాహరణగా నిలిచారు. ‘నిర్భయం చట్టం’ –…

జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులు నీరు కార్చుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్

అనుకున్నదే అయింది. ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం తర్వాత మాటల్లో, హామీల్లో అగ్ని కణాలు రువ్విన ప్రభుత్వ పెద్దలు చేతల్లో తుస్సుమనిపించారు. మహిళల భద్రతకే తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని డంబాలు పలికిన ప్రధాని మన్మోహన్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీలు జస్టిస్ వర్మ కమిటీలోని ప్రధాన సిఫారసులను గాలికి వదిలేశారు. ప్రధాన సిఫారసులను నిరాకరించిన అప్రతిష్టను కప్పిపుచ్చుకోవడానికో యేమో తెలియదు గానీ వర్మ కమిటీ నిరాకరించిన మరణ శిక్షను అరుదైన కేసుల్లో విధించడానికి…

మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రధాన అంశాలు

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి. సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు. సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి. ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో…

పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ

80,000కు పైగా సలహాలు, సూచనలు అందుకున్న జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారించడానికి వీలుగా చట్టాల మెరుగుదలకు తగిన సిఫారసులు చేయడానికి 30 రోజుల గడువు కోరిన జస్టిస్ వర్మ కమిటీ ఒక రోజు ముందుగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నల్ల చట్టాలు అడ్డు పెట్టుకుని…

ఉరి వద్దు, సజీవ దహనం చెయ్యండి -అమానత్ కోరిక

అమానత్/దామిని/నిర్భయ మిత్రుడు మౌనం వీడి కొన్ని చేదు నిజాలు చెప్పాడు. సాయం కోసం అరిచినా 45 నిమిషాల సేపు ఒక్క వాహనంగానీ, ఒక్క వ్యక్తిగానీ ఆగకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు విపరీతమైన ఆలస్యం చేశారనీ, నగ్నంగా ఉన్న తనకుగానీ, తన స్నేహితురాలికిగానీ కనీసం కప్పుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చిన పాపాన పోలేదనీ అతను ఆరోపించాడు. విపరీతంగా రక్తం కారుతున్న తన స్నేహితురాలిని తానొక్కడినే ఎత్తుకుని పి.సి.ఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్)…

బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్…