అరేబియా అత్తరులు అన్నీ కలిపి కడిగినా… -జస్టిస్ కట్జు

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఛైర్మన్ కూడా అయిన జస్టిస్ మార్కండేయ కట్జు నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో పేరు సంపాదించాడు. బాల్ ధాకరే మరణానంతరం అంతిమ యాత్ర కోసం ముంబై బంద్ చెయ్యడం పైన ఫేస్ బుక్ లో వ్యాఖ్య చేసిన, లైక్ చేసిన ఇద్దరు యువతులపై ఐ.టి చట్టం ప్రయోగించడాన్ని బహిరంగంగా తప్పు పట్టి తద్వారా ధాకరే నివాళుల పర్వంలో బారులు తీరిన పత్రికల పతాక శీర్షికలను…

ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు…

ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు

ధాకరే అంతిమ యాత్ర కూడా ముంబై ప్రజలకు విద్వేషంలోని మరో కోణాన్ని చవి చూపింది. ధాకరే అంతిమయాత్ర కోసం ముంబై బంద్ పాటించడం వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచిన అమ్మాయితో పాటు ఆ సందేశాన్ని లైక్ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అమ్మాయిల అరెస్టుకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ కోరుతూ ఆయన…

నేనెందుకు ధాకరేకు నివాళులు అర్పించలేను? -జస్టిస్ కట్జు

(జస్టిస్ మార్కండేయ కట్జు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశాడు. ఇప్పుడాయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఛైర్మన్. తన అభిప్రాయాలను జస్టిస్ కట్జు నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తాడని పేరు. దానివలన ఆయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులూ దాదాపు అంతమంది ఉన్నారు. ముద్రణా మీడియాపై నియంత్రణ ఉన్నట్లే దృశ్య, శ్రవణ మీడియా పై కూడా పరిమిత నియంత్రణ ఉండాలని వాదించడం వలన ఆయనకి మీడియాలో కూడా వ్యతిరేకులు ఉన్నారు. రెండు రోజుల…