మావోయిస్టు అవడం నేరం కాదు -చారిత్రక తీర్పు

కేరళ హై కోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించింది.  జస్టిస్ చిన్నపరెడ్డి (కిష్టయ్య, బాలాగౌడ్ కేసు), జస్టిస్ తార్కుండే (ప్రభుత్వోద్యోగుల రాజకీయ భావాలు) లాంటి గొప్ప న్యాయమూర్తుల తీర్పుల సరసన చేర్చగల ఈ తీర్పు ప్రకారం కేవలం మావోయిస్టుగా ఉండడమే నేరం కాదు. దేశంలో అమలులో ఉన్న చట్టాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యకు పాల్పడనంతవరకు మావోయిస్టు భావజాలం ఒక వ్యక్తిని నేరస్ధుడిగా చేయబోదని తీర్పు పేర్కొంది. మావోయిస్టు భావజాలం దేశంలో ఉనికిలో ఉన్న రాజ్యాంగబద్ధ రాజ్యపాలన (constitutional polity)…