మాంద్యం వైపుకి జర్మనీ నడక, రష్యా ఆంక్షల ఫలితం!

తప్పుడు ఆరోపణలు చేస్తూ రష్యాపై అమెరికా, ఐరోపాలు విధించిన ఆంక్షలు తిరిగి వాటి మెడకే చుట్టుకుంటున్నాయి. 2014 సంవత్సరంలో రెండవ త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్) లో ఇప్పటికే జి.డి.పి సంకోచాన్ని నమోదు చేసిన జర్మనీలో ఆగస్టు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ సంకోచించింది. అనగా పారిశ్రామిక ఉత్పత్తి క్రితం నెలతో పోల్చితే వృద్ధి చెందడానికి బదులు కుచించుకుపోయింది. జర్మనీ ఆగస్టు వ్యాపార ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికా, ఐరోపా దేశాల స్టాక్ మార్కెట్ లు నష్టాల్లోకి…