కుర్చీలేని మహారాణి -కార్టూన్

  భారత దేశంలో మహా రాజులకు, మహా రాణులకు, యువరాజు, యువరాణిలకు కొదవలేదు. ఒకప్పడు రాజ్యాలు యేలి ప్రజలను పీడించుకు తిని సంపదలు కూడబెట్టిన రాజ్యాధీశులే నేడు ఆధునిక రాచరికం వెలగబెట్టడం కళ్ల ముందు కనపడుతున్న నగ్న సత్యం. ఆనాడు వారసత్వంగా రాచరిక ఆధిపత్యం సంక్రమించినట్లే నేడూ వారసత్వంగా రాజకీయ ఆధిపత్యం సంక్రమిస్తోంది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను పడదిట్టిపోసే పార్టీలు కూడా తమ తమ వారసత్వాలను కాపాడుకుంటూ ప్రజల నెత్తిన గుడిబండల్ని మోపుతున్నారు. ఒకనాటి రాచరికాలు కొనసాగుతుండగానే…

పురచ్చి తలైవి రెండాకులు ఎక్కడ పూసేను? -కార్టూన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు ‘అందని ద్రాక్ష’ ఆ ద్రాక్ష పండు భవిష్యత్తులో ఎవరికి తీపిని ఇస్తుందో ఎవరికి పుల్లదనాన్ని మిగుల్చుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 2జి కుంభకోణం దరిమిలా ఎ రాజా, దయానిధి మారన్ లపై నమోదయిన సి.బి.ఐ కేసులు డి.ఎం.కె పార్టీని అవాంఛనీయ పార్టీగా అందరూ చూస్తుండగా అన్నా డి.ఎం.కె ఆకర్షణీయంగా మారిపోయింది. పార్టీ అధినేత్రి, పురచ్చి తలైవి, జయలలిత తన రెండాకుల గుర్తును ఏ కూటమికి కానుకగా ఇస్తుందన్నది…