ఫెడరల్ ఫ్రంట్, ఆల్టర్నేట్ ఫ్రంట్… ఏది ధర్డ్ ఫ్రంట్?

దేశంలో నాలుగో కూటమి రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరిపిన జయలలిత లెఫ్ట్ తో చర్చలు ముగిస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. దానితో వామపక్షాలు, ఇతర కిచిడి పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఆల్టర్నేట్ ఫ్రంట్’ లో జయలలిత చేరిక ఆగిపోయింది. ఎ.ఐ.డి.ఏం.కె అధినేత్రి వామపక్షాలతో ఎన్నికల బంధం తెంచుకోవడం ఒక ఎత్తయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్ చేయడం మరో ఎత్తు. ఈ ఫోన్ కాల్ తో…

తమిళనాట కులాల కాలకూట విషం విరజిమ్ముతున్న పి.ఎం.కె

కుల దురభిమానమే పెట్టుబడిగా స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సిద్ధపడిన డాక్టర్ ఎస్.రాందాస్ తమిళనాడులో కులాల కాలకూట విషాన్ని విరజిమ్ముతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా, అది రాకపోతే సృష్టించుకుని మరీ అమాయక పేద ప్రజల మధ్య చిచ్చు రగుల్చుతున్నాడు. ‘చిత్ర పౌర్ణమి’ యూత్ ఫెస్టివల్ పేరుతో ఏప్రిల్ 25 తేదీన రాందాస్ నేతృత్వంలోని ‘పట్టలి మక్కల్ కచ్చి’ (పి.ఎం.కె) పార్టీ నిర్వహించిన వన్నియార్ ‘కుల పండగ’ దళితుల రక్తాన్ని మరోసారి చిందించింది. గంధపు చెక్కల స్మగ్లర్ గా రెండు రాష్ట్రాల…

ఇలా అయితే ఇంకో దేశానికి వెళ్లిపోతా –కమల్ హాసన్

తన సినిమా ‘విశ్వరూపం’ సినిమా విడుదల కాకుండా ఆగిపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం పూర్తిగా ‘రాజకీయం’ అనీ, ఇందులో మతపరమైన కారణాలు లేనే లేవని ఆయన నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 4 తేదీన వెలువడనున్న హై కోర్టు తీర్పు కోసం తాను ఎదురు చూస్తానని, ఈ లోపు సుప్రీం కోర్టుకి వెళ్ళే ఉద్దేశ్యాలు తనకు లేవని స్పష్టం చేశాడు. దేశాన్ని విడిచి వెళ్ళిన…

ప్రభుత్వాల ఉదాసీనత ఫలితం, తమిళనాడులో శ్రీలంక యాత్రీకులపై దాడులు

శ్రీలంక తమిళుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి శ్రీలంక యాత్రీకులపై విద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు దేవాలయాలను సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులు మధ్యలోనే ప్రయాణం ముగించుకుని భయాందోళనలతో తిరుగు ప్రయాణం కట్టారు. తమిళనాడు సందర్శనకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం ‘ట్రావెల్ అడ్వైజరీ’ కూడా జారీ చేయవలసిన పరిస్ధితి తలెత్తింది. తమిళనాడు తమిళులనుండి రాళ్ళు, చెప్పుల దాడిని ఎదుర్కొన్న యాత్రికులలో శ్రీలంక తమిళులే మెజారిటీ కావడం జాతి…

13 ఏళ్ళ బాలుడిని కాల్చి చంపిన డిఫెన్సు కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డు

చెట్టు కాయను కోసుకు తిందామని మిలట్రీ కాంప్లెక్సులోకి గోడదూకి వెళ్ళీన 13 ఏళ్ళ బాలుడిని ఆ కాంప్లెక్సు సెక్యూరిటీ గార్డు తుపాకితో కాల్చి చంపాడు. ఆ సైనికుడు ముందూ వెనకా చూడకుండా విచక్షణా రహితంగా తుపాకికి పనిచెప్పి ఓ తల్లి గర్భశోకానికి కారణమయ్యాడు. రక్షణ బలగాలు నివసించే నివాస కాంప్లెక్స్ లోకి దిల్షాన్ అనే బాలుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి గోడ దూకి ప్రవేశించాడు. చెట్టుకి కాసిన పండుని కోసుకు తిందామని చెట్టు ఎక్కుతుండగా సెక్యూరిటీ…