శశికళ స్ట్రోక్: పన్నీర్ బహిష్కరణ, పళనిస్వామి ఎంపిక
బిజేపి ఎత్తుకు శశికళ పై ఎత్తు వేశారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పై బహిష్కరణ వేటు వేశారు. ఏఐఏడిఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా అప్పటి జయలలిత విధేయుడు, ఇప్పటి తన విధేయుడు అయిన పళని స్వామిని ఎంపిక చేసింది. ఫలితంగా పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి అవకాశాలు రాజ్యాంగ పరంగానే మూసుకుపోయాయి. శశికళ అనుచరునికి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు మెరుగు పడ్డాయి. పళనిస్వామి అప్పుడే గవర్నర్ ని కలిశారు. తనకు 127 మంది…