టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!

పాత 500, 1000 నోట్లు రద్దు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పిన కారణాల్లో ఒకటి: టెర్రరిజం ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం. దొంగ నోట్లు, హవాలా డబ్బుతో సీమాంతర ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్ ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టు ఫైనాన్స్ వెన్ను విరిగిపోతుందని ప్రధాని పిడికిలి బిగించి మరీ చెప్పారు. ప్రధాని చెప్పడమే కాదు, నోట్ల రద్దు వలన కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు హఠాత్తుగా ఆగిపోయాయని కూడా…

పి‌డి‌పి ఆరోపణ: కాశ్మీర్ సి.ఎంని గౌరవించని మోడి!

జమ్ము & కాశ్మీర్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ కు తగిన గౌరవాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడి ఇవ్వలేకపోయారని పి‌డి‌పి నేత, దివంగత నేత కుమార్తె మెహబూబా ముఫ్తి భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ముఫ్తి మహమ్మద్ సయీద్ విగత దేహం ఢిల్లీ ఆసుపత్రిలో ఉండగా సందర్శించడమే కాకుండా ప్రత్యేకంగా శ్రీనగర్ వెళ్ళి మరీ మెహబూబాను ఓదార్చిన నేపధ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా ఉండగా జబ్బు పడి ఎయిమ్స్…

కాశ్మీర్ లో ఉక్కు పాదం -ది హిందు ఎడిట్..

[మే 21 తేదీన ఉత్తర కాశ్మీర్ లోని పల్హాలాన్ గ్రామంలో గ్రామ ప్రజలు మీర్వాయిజ్ మౌల్వీ ఫరూక్ 25వ వర్ధంతి సందర్భంగా ఊరేగింపు జరుపుతుండగా పోలీసులు ఊరేగింపు పైకి పంప్ గన్ పెల్లెట్లు పేల్చారు. నాన్-లెధల్ వెపన్ పేరుతో కాశ్మీర్ భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న ఈ ఆయుధాల వల్ల వందలమంది తీవ్ర గాయాలపాలై కంటి చూపు కోల్పోతున్నారు. నాన్-లెధల్ అని చెప్పినప్పటికీ పదుల సంఖ్యలో వీటి బారినపడి మరణించారు. మే 21 తేదీన ట్యూషన్ కి వెళుతూ…

కాశ్మీర్ నాటకం -కార్టూన్

పరస్పర విరుద్ధ ధృవాలుగా అనదగ్గ రాజకీయ అవగాహనలు కలిగి ఉన్న బి.జె.పి, పి.డి.పి లు కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పరిచాయి. ఈ ప్రభుత్వం ఎకాఎకిన ఏర్పడిందేమీ కాదు. రెండు నెలలపాటు చర్చలు జరిపి ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ రూపొందించుకుని ఏర్పడిన ప్రభుత్వం. కనుక ఇరు పార్టీలు తమ వైరుధ్యాల కంటే ప్రజా పాలన పైనే ఎక్కువ దృష్టి పెడతారని ఆశించడం సహజం. కానీ ప్రభుత్వం ఏర్పడింది లగాయితు పాలన కంటే వైరుధ్యాల కారణంగానే పాలక పక్షాలు రెండూ…

కాల్పుల విరమణను కాపాడండి! -ది హిందు ఎడిట్

(ఇండియా-పాకిస్ధాన్ ల మధ్య సరిహద్దుల ఆవలి నుండి కాల్పులు జరగడం మళ్ళీ నిత్యకృత్యంగా మారిపోయింది. పాక్ కాల్పుల్లో సోమవారం 5గురు భారతీయ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఇండియా కాల్పుల్లో తమ పౌరులూ మరణించారని, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారత సైనికులు కాల్పులు జరుపుతున్నాయని పాకిస్ధాన్ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ది హిందు పత్రిక ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఆధీన రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చెదురు…

ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?

ఉమేష్ పాటిల్: ఆర్టికల్ 370 గురించి వివరించండి. కాశ్మీర్ కి అది అవసరమా? సమాధానం: జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా…

పత్రిబాల్ కేసు తిరిగి తెరవండి -ది హిందు సంపాదకీయం

(2000 సం.ము మార్చి 24-25 తేదీల మధ్య రాత్రి దినాన కాశ్మీర్ కు చెందిన 5గురు అమాయక యువకులు సైనికుల కరకు గుళ్ళకు బలై చనిపోయారు. వారు సీమాంతర ఉగ్రవాదులని సైన్యం దేశానికి చెప్పింది. కాదు వారు అనంత్ నాగ్ ఏరియా నివాసులని సి.బి.ఐ నిర్ధారించింది. సైన్యం AFSPA చట్టాన్ని కవచంగా తెచ్చుకోగా సుప్రీం కోర్టు సరేనంది. కోర్టు మార్షల్ అయినా చెయ్యాలంది. ఆ కోర్టు మార్షల్ మొన్న ముగిసింది. తమవాళ్లు తప్పు చేయలేదని నిర్ధారించి కేసు…