గిరాకీ కోల్పోతున్న అమెరికా బాండ్లు -విశ్లేషణ
అమెరికా ఆర్ధిక పరపతి క్షీణిస్తున్న నేపధ్యంలో అమెరికా ఋణ పెట్టుబడులకు గిరాకీ తగ్గిపోతున్నది. అంటే అమెరికాకి అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్లు తగ్గిపోతున్నారు. ఋణ పరపతి తగ్గిపోవడం అంటే చిన్న విషయం కాదు. మార్కెట్ ఎకానమీ ఆర్ధిక వ్యవస్ధలు అప్పులపై ఆధారపడి రోజువారీ కార్యకలాపాలు నడిపిస్తుంటాయి. అప్పులు తెచ్చి ఖర్చు చేస్తూ ఆ తర్వాత పన్నుల ఆదాయంతో అప్పులు తీర్చుతుంటాయి. అప్పు ఇచ్చేవాళ్లు లేకపోవడం అంటే దేశ ఆర్ధిక వ్యవస్ధ సామర్ధ్యంపై నమ్మకం క్షీణిస్తున్నట్లు అర్ధం. సార్వభౌమ…