జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు

శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన…

జపాన్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు, అణు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అప్ డేట్: ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటు చుట్టూ 10 కి.మీ లోపు ఖాళీ చేయించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 20 కి.మీ కు పెంచినట్లుగా ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ చెప్పాడు. 6:24  pm ఇండియా టైమ్. మానవ చరిత్రలో మొదటి సారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా అణు  బాంబు ఫలితాన్ని చవిచూసిన జపాన్, శుక్రవారం సంభవించిన అతిపెద్ద భూకంపం ధాటికి మరో అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. జపాన్ రాజధాని టోక్యో నగరానికి…

జపాన్ ను వణికించిన భారీ భూకంపం, ముంచెత్తిన సునామీ

[అప్ డేట్: జపాన్ సునామీలో మరణించిన వారి సంఖ్య: 300 దాటింది] జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో సమద్ర గర్బాన భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్బాన భూకంపం సంభవించడం వలన అది భారీ సునామీగా పరిణమించి జపాన్ తీరప్రాంతాన్ని ముంచెత్తింది. రిక్టర్ స్కేల్ పై 8.9 గా నమోదైన ఈ భూకంపం, జపాన్ లో 140 సంవత్సరాల క్రితం భూకంపం రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యంత భారీ భూకంపంగా జపాన్ తెలిపింది.…