ఫుకుషిమా శుభ్రతకు దశాబ్దాలు, అణు పరిశ్రమకు అంతం పలకాలని కోరుతున్న జపాన్

“జపాన్ కాంగ్రెస్ ఎగైనెస్ట్ అటామిక్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్” మొదటి సమావేశం, భూకంపం, సునామీల వలన అణు ప్రమాదం సంభవించిన ఫుకుషిమాలో సోమవారం ప్రారంభమయ్యింది. అణు విద్యుత్ పరిశ్రమకు ఇక అంతం పలకాలని ఆ సదస్సు కోరింది. అణు విద్యుత్ కానీ, అణు బాంబులు కానీ ఏవీ వాంఛనీయం కాదనీ రెండూ మానవాళికి ప్రమాదకారులేననీ సమావేశం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 9 పరిమాణంతో మార్చి 11 న ఫుకుషిమా దైచి అణు ప్లాంటు వద్ద సంభవించిన…