రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…

ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్

2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల…

‘ఆడలేక మద్దెల ఓడు’: అమెరికా సమస్యలకు జపాన్, యూరప్‌లే కారణమంటున్న ఒబామా

“ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టుంది అమెరికా అర్ధిక సమస్యలకి బారక్ ఒబామా చూపుతున్న కారణాలు. జపాన్, యూరప్ ల వలన అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేక పోతున్నదని బారక్ ఒబామా చెబుతున్నాడు. జపాన్ భూకంపం, యూరప్ అప్పు సంక్షోభాలే అమెరికా ఆర్ధిక వృద్ధికి ఆటంకంగా పరిణమించాయని ఒబామా తాజా పరిశోధనలో కనిపెట్టారు. ఇంతవరకూ ఏ ఆర్ధిక వేత్తగానీ, విశ్లేషకులు గానీ చేయనటువంటి విశ్లేషణ ఇది. అమెరికా ప్రభుత్వం తాజాగా శుక్రవారం వెలువరించిన గణాంకాలు అమెరికా…

భూకంపం దెబ్బకి మళ్ళీ ఆర్ధిక మాంద్యంలోకి జారుకున్న జపాన్

ఊహించినంతా జరిగింది. సంవత్సరాలపాటు డిఫ్లేషన్‌తో తీసుకున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ భూకంపం, సునామిల ధాటికి మరోసారి ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లోకి జారిపోయింది. వినియోగదారుల డిమాండ్ ఘోరంగా పడిపోవడం, రేడియేషన్ భయాలతో ఎగుమతులు కూడా పడిపోవడంతో ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జపాన్ జిడిపి కుచించుకుపోయింది. ఆర్ధిక నియమాల ప్రకారం వరుసగా రెండు క్వార్టర్ల పాటు జిడిపి తగ్గుదల నమోదు చేసినట్లయితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ ఎదుర్కొంటున్నట్లు…

ఇండియా జపాన్ ల మధ్య కుదిరిన స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం

ఇండియా, జపాన్ లు టోక్యోలో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇండియా ప్రతినిధిగా వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, జపాన్ ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సీజీ మాయెహారా ఒప్పందం పై సంతకాలు చేశారు. రానున్న దశాబ్ద కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగే సరుకుల్లో 94 శాతం పైన పన్నులు ఈ ఒప్పందం ప్రకారం రద్దవుతాయి. టెక్స్ టైల్స్, మందులు, ఆటో లాంటి రంగాలతో పాటు సర్వీసు రంగాలు కూడా ఈ ఒప్పందం పరిధి…

జపాన్ ను అధిగమించి రెండో స్ధానానికి చేరిన చైనా అర్ధిక వ్యవస్ధ

చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. రెండవ స్ధానంలో ఉన్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి చైనా రెండో స్ధానం లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 2010 సెప్టెంబరు నాటికే చైనా జపాన్ ను అధిగమించింది. వార్తా సంస్ధలు ఎందుకనో అప్పట్లో పట్టించుకోలేదు. 2010 డిసెంబరుతో చైనా ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు ఆర్ధిక సంవత్సరం క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఆర్ధిక సంవత్సరం ముగిసాక చైనా…