జన్ లోక్ పాల్ ఓటమి, రాజీనామా దిశగా అరవింద్

దేశ రాజకీయ చిత్రపటంపై తమను తాము ఉప్పు-నిప్పుగా చెప్పుకునే కాంగ్రెస్, బి.జె.పి లు ఒక తాటి మీదికి రావడంతో ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశ దశలోనే ఓటమిని ఎదుర్కొంది. దానితో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసే దిశలో ప్రయాణిస్తోంది. ముఖేష్ అంబానీపై రాష్ట్ర ఎ.సి.బి చేత అవినీతి కేసు నమోదు చేయించినందుకే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటయ్యాయని అరవింద్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఎంత దూరం అయినా…

ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్

“పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”, ఇది కదా అసలు సామెత! కానీ ఢిల్లీ సర్కార్ విషయంలో ఈ సామెత రివర్స్ అయిపోయింది. ‘టాం అండ్ జెర్రీ’ లోని ఎలుక తరహాలో కాంగ్రెస్ పిల్లిని ఎఎపి ఎలుక అదే పనిగా ఆట పట్టించడం జనానికి భలే పసందైన కనుల విందు. కాకపోతే మద్దతు ఇస్తున్న పార్టీ వణకడం ఏమిటి? మద్దతు తీసుకుంటున్న పార్టీ ‘మద్దతు వెనక్కి తీసుకుంటారా, అయితే తీస్కోండి’ అంటూ చిద్విలాసంగా సవాళ్ళు విసరడం ఏమిటి?…

ఆదివారం తన నిరవధిక నిరాహార దీక్షను ముగించనున్న అన్నా హజారే

అన్నా అభిమానులకు శుభవార్త. ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన మూడు డిమాండ్లను పార్లమెంటులో ఓటింగ్ కి పెట్టడానికి అంగీకరిస్తున్నట్లు పౌర సమాజ ప్రతినిధులకు ప్రణబ్ ముఖర్జీ లేఖ రాయడంతో అన్నా బృందంలో ఆనందం వెల్లివిరిసింది. శనివారం ఈ మేరకు తమకు లేఖ అందినట్లుగా అన్నా బృందం విలేఖరులకి తెలిపింది. లోక్ పాల్ బిల్లుపై తమ డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఓటింగ్ కి ప్రవేశపెడుతున్నట్లు గా ప్రభుత్వం నుండి తమకు సమాచారం అందిందని టీమ్ అన్నా తెలిపింది. ఈ పరిణామం…

నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం “ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్” తోనే బుకర్ ప్రైజ్ గెలుచుకున్న కేరళ వాసి. భారత రాజకీయ ముఖచిత్రాన్ని తన సంచలనాత్మక విశ్లేషణలతో, పదునైన విమర్శతో గేలి చేయగల సాహసి. తన భావాలను ముక్కుసూటిగా, భయం లేకుండా వెల్లడించగల అరుదైన భారతీయ మహిళ. ఈమె పది రోజుల క్రితం రాసిన ఈ వ్యాసాన్ని “ది హిందూ” పత్రిక ప్రచురించింది. అన్నా హజారే వెంట భారత…

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సంపూర్ణమైనదేనా?

భారత దేశానికి స్వాతంత్రం తేవడానికి ఏర్పడిందంటున్న కాంగ్రెస్ పార్టీ నిజానికి 1920 ల వరకూ సంపూర్ణ స్వాతంత్ర్యం అన్న నినాదం ఇవ్వలేదు. అంటే అప్పటివరకూ జరిగిన ఉద్యమం కొన్ని రాయితీల కోసమే జరిగింది. నామమాత్ర ఎన్నికలు నిర్వహించడం, పాలనలో భారత లెజిస్లేచర్ల అభిప్రాయాలు కూడా పరిగణించడం (అమలు చేయాలని రూలేమీ లేదు) ఇత్యాధి రాయితీల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ (గాంధీతో సహా) ఉద్యమించింది. ఆ తర్వాత అతివాదుల ప్రాబల్యం, కమ్యూనిస్టు విప్లవకారుల ఉద్యమ వ్యాప్తి అన్నీ…

అన్నా కేంద్రంగా దేశమంతా విస్తరించిన అవినీతి వ్యతిరేక సమరం -ఫొటోలు

నిరవధిక నిరాహార దీక్ష చేయకుండా ప్రభుత్వం అన్నా హజారే అరెస్టు చేయించడంతో అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశమంతా పాకింది. అరెస్టు చేయడం వల్లనే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఇంత స్పందన వచ్చిందని కొందరు సూచిస్తున్నారు. ఆ సూచన నిజం కాకపోవచ్చు. అరెస్టు కాకపోయినప్పటికీ అన్నా హజారే నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత కూడా ఇదే విధమైన స్పందన వచ్చి ఉండేది. కాకపోతే అన్నా అరెస్టు వలన ప్రజల్లో భావోద్వేగాలు అదనంగా వచ్చి చేరాయి. ఈ భావోద్వేగాలు అన్నాకు…

నేనున్నా లేకున్నా ఈ జ్యోతిని ఆరనివ్వకండి -తీహార్ వద్ద అన్నా

“నేనిక్కడ ఉన్నా లేకున్నా మండుతున్న ఈ జ్యోతిని మాత్రం ఆర్పకండి. భారత దేశం అవినీతి బంధనాలను తెంచుకునేవరకూ ఈ జ్యోతి మండుతూనే ఉండాలి” తీహార్ జైలునుండి బైటికి వచ్చిన అనంతరం తనను చూడడానికి, ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన వేలమంది మద్దతుదారులను చూసి, ఉద్వేగభరితుడైన అన్నా హజారే అన్న మాటలివి. ఇంతకుమున్నెన్నడూ లేని రీతిలో ప్రజానీకం అన్నా హజారేను జైలునుండి వెలుపలికీ ఆహ్వానించడానికి పెద్ద సంఖ్యలో హాజరైనారు. మూడు రోజుల పాటు జైలులో గడిపిన హజారే, శక్తివంతమైన లోక్…

నిరవధిక నిరాహార దీక్ష కాదు, ఆరోగ్యం అనుమతించేవరకే

జన్ లోక్ పాల్ బిల్లు ను పార్లమెంటు ముందుకు తేవాలంటూ అన్నా హజారే తలపెట్టిన దీక్ష “నిరవధిక నిరాహార దీక్ష కాదనీ, అన్నా ఆరోగ్యం అనుమతించే వరకే” ననీ పౌర సమాజ కార్యకర్తలు ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ “నిరవధిక నిరాహార దీక్ష” (ఆమరణ నిరాహార దీక్ష కాదు) అని ప్రకటిస్తూ వచ్చిన అన్నా బృందం తమ నిర్ణయాన్ని మార్చుకున్నారా లేక మొదటినుండీ అదే ఉద్దేశ్యమా అన్నది తెలియరాలేదు. అన్నా హజారే బృందం, ఢిల్లీ పోలీసుల…