భద్రతపై విభేదాలు, ఒబామా ఆగ్రా పర్యటన రద్దు

అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దయిందని భారత అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తన భార్య మిచెల్లే ఒబామాతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శిస్తారని ఇప్పటివరకు ఇరు దేశాలు విడుదల చేసిన షెడ్యూళ్ళు చెబుతూ వచ్చాయి. కానీ ఆగ్రా పర్యటన సందర్భంగా ఒబామా భద్రత కోసం తీసుకోవలసిన చర్యల విషయమై భారత భద్రతా బలగాలకు, అమెరికా భద్రతా బలగాలకు స్వల్ప విభేదాలు తలెత్తడంతో ఒబామా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 24వ…