దిష్టి బొమ్మను నిలబెట్టి, దానిపైనే రెట్ట వేస్తూ… -కార్టూన్

‘జనతా పరివార్’ గా చెప్పుకుంటున్న నేతల భాగోతం ఇది! తమను తాము దళితోద్ధారకులుగా చెప్పుకోవడం ఈ నేతలకు ఉన్న అలవాటు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాము సెక్యులరిస్టులం అని కూడా వీళ్ళు చెప్పుకుంటారు. వాస్తవంలో వీరి ఆచరణ అంతా అందుకు విరుద్ధం. ఎన్నికల్లో బి.జె.పి చేతుల్లో చావు దెబ్బ రుచి చూసిన నితీశ్ కుమార్ పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి ఒక దిష్టి బొమ్మను వెతుక్కుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టారు. ఆయన పేరు జీతన్…