బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్యం? -కార్టూన్

జనతా దళ్ (యునైటెడ్) బీహార్ కాంగ్రెస్ కి పెద్ద చిక్కే తెచ్చిపెట్టినట్లుంది! ఆ పార్టీ మీదా, పార్టీ నాయకుల మీదా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నప్పటికీ బీహార్ వరకు చూసుకుంటే ఒక సమస్య కాంగ్రెస్ ముందు నిలబడి ఉంది. ఎన్.డి.ఏ నుండి చీలిన జనతాదళ్ (యు)తో సఖ్యత పెంచుకోవడమా లేక ఎప్పటి నుండో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ తోనే స్నేహం కొనసాగించడమా? పోనీ రెండింటితో సఖ్యత నెరుపుదామంటే ఒకే…

ఎన్.డి.ఎ కి జె.డి(యు) రామ్ రామ్

పత్రికలు ఊహించినట్లే జరిగింది. జనతాదళ్ (యునైటెడ్) పార్టీ జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఎ) కి రామ్ రామ్ చెప్పేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా బి.జె.పి పరోక్షంగా ప్రకటించిన వారం రోజులకి ఆ పార్టీ ప్రతిపక్ష కూటమి నుండి బిచాణా ఎత్తేసింది. ప్రస్తుత పాలక్ష కూటమి లోకి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా చేరుతుందో లేదో గానీ ఇప్పటికైతే బీహార్ లో పరిస్ధితిని సవరించుకునేలో పడింది. బి.జె.పి మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించి జూన్ 19…

మైనస్ జె.డి(యు), మోడి ఇమేజ్ భారం బి.జె.పి ఆపగలదా? -కార్టూన్

బి.జె.పి లో నరేంద్ర మోడి అనుకూల ప్రచారం ఇతర నాయకులకు అలవి కానంతగా పెరిగింది. మోడి తప్ప దేశానికి దిక్కు లేదని దేశ ప్రజలకు నచ్చజెప్పడానికి ఆయన పార్టీ మద్దతుదారులు, అభిమానులు చెవినిల్లు కట్టి పోరుతున్నారు. మోడీకి ముందే జరిగిన గుజరాత్ అభివృద్ధిని కూడా మోడి చలవే అని తాము నమ్మి ఇతరులను కూడా నమ్మమంటున్నారు. మోడి ప్రధాని అయితే మంత్రి పదవులు దక్కుతాయన్న అసవల్లనే యేమో గాని బి.జె.పిలో ఆరెస్సెస్సేతర నాయకులైన యశ్వంత్ సిన్హా లాంటివారు…