ఉక్రెయిన్ సంక్షోభం: మరింత దగ్గరవుతున్న రష్యా, చైనా

ఉక్రెయిన్ సంక్షోభం పలు భౌగోళిక రాజకీయాలకే కాకుండా ఆర్ధిక పరిణామాలకు కూడా బాటలు వేస్తోంది. ఐరోపా, రష్యాల మధ్య కీలక స్ధానంలో ఉన్న ఉక్రెయిన్ ను నిస్పక్ష ప్రాంతంగా నిలిపి ఉంచడం ద్వారా నాటో దూకుడుని రష్యా పాక్షికంగానైనా నిరోధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ నాటో చేతుల్లోకి వెళ్లిపోవడంతో తన విదేశాంగ విధానాన్ని సవరించుకోవలసిన తక్షణ అవసరం రష్యాకు ఏర్పడింది. రష్యా శక్తి వనరులకు పెద్ద వినియోగదారుగా ఉన్న ఐరోపాకు బదులు ఆ స్ధానాన్ని భర్తీ…

చమురు లీకేజి శుభ్రం చేసే కార్మికుల కష్టాలు చూసితీరాలి -ఫోటోలు

జులై 17, 2010 తేదీన చైనా ఈశాన్య రాష్ట్రం లియావోనింగ్ లో చమురు ప్రమాదం సంభవించి ‘పచ్చ సముద్రం’ ను ముంచెత్తింది. చమురు డాక్ యార్డ్ లో చమురు ట్యాంకులు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం చమురు లీకేజీని అరికట్టడానికి, పొర్లిపోయిన చమురుని తిరిగి ఎత్తి వినియోగంలోకి తేవడానికీ, సముద్ర కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ఆ దృశ్యాలే ఇవి. 1500 తన్నుల క్రూడాయిలు సముద్రంలోకి ఒలికిపోగా అందులో మూడో వంతుని…

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చైనాల ఢీ

దక్షిణ చైనా సముద్రంలో భారత్ చైనాల మధ్య వైరం రగులుకుంటోంది. వియత్నాం దేశం ఆహ్వానం మేరకు దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వెలికి తీతకు ఒ.ఎన్.జి.సి ప్రయత్నాలు చేయడాని వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం ఇండియాను హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్, సహజ వాయువుల వెతుకులాటకు ఇండియా కంపెనీలు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రి వియత్నాం సందర్శించనున్న నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నాంతో…

ఇండియా, చైనా, అమెరికాల్లో దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం

ఇండియా ద్రవ్యోల్బణం తగ్గించడమే మా మొదటి ప్రాధాన్యం అంటూ భారత ప్రధాని నుండి ప్రణాళికా కమిషన్ ఉపాధ్యక్షుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు వరకూ గత సంవత్సరం ప్రారంభం నుండీ అదే పనిగా ఊదరగోట్టినా, వారి హామీలు కార్య రూపం దాల్చలేదు. తాజా గణాంకాల ప్రకారం ఇండియాలో ద్వవ్యోల్బణం మార్చి నెలలో 8.9 శాతానికి చేరింది. మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5.5 శాతానికి తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా,…

అణువిద్యుత్ ప్లాంటుల నిర్మాణంపై పునరాలోచనలో చైనా

జపాన్ లోని ఫుకుషిమా ‘దాయిచి’ అణువిద్యుత్ ప్లాంటు లో అణు రియాక్టర్లు పేలిపోయి పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదల కావడం, రేడియేషన్ నియంత్రణకు జపాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుండడం, జపాన్ నుండి రేడియేషన్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుండడం కారణాలతో పెద్ద ఎత్తున అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణం తలపెట్టిన చైనా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ భద్రతా వ్యవస్ధలను సమీక్షిస్తున్నట్లు…

“మల్లెల విప్లవం” నేపధ్యంలో దేశ వ్యాపిత “డేటాబేస్” నిర్వహణకై చైనా అధికారి సూచన

  అరబ్ ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో చైనాలో క్రితం వారం ఇంటర్నెట్ ద్వారా అటువంటి ప్రదర్శనను నిర్వహించాలంటూ ప్రచారం జరిగిన నేపధ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఝౌ యాంగ్ కాంగ్ హెచ్చరించాదు. పొలిట్ బ్యూరోలో ఝౌ, చట్ట పాలనకు (లా అండ్ ఆర్డర్) భాద్యుడు. సామాజిక వ్యవస్ధ నిర్వహణ పట్ల జాగ్రత్త వహించాలనీ సమాజంలో సంఘర్షణలను, సమస్యలను ముందే గుర్తించాలనీ ఆయన సీనియర్ అధికారులను కోరినట్లుగా అధికార…

జపాన్ ను అధిగమించి రెండో స్ధానానికి చేరిన చైనా అర్ధిక వ్యవస్ధ

చైనా ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. రెండవ స్ధానంలో ఉన్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి చైనా రెండో స్ధానం లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి 2010 సెప్టెంబరు నాటికే చైనా జపాన్ ను అధిగమించింది. వార్తా సంస్ధలు ఎందుకనో అప్పట్లో పట్టించుకోలేదు. 2010 డిసెంబరుతో చైనా ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. చైనా, అమెరికా, జపాన్ లాంటి దేశాలకు ఆర్ధిక సంవత్సరం క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా ఉంటుంది. ఆర్ధిక సంవత్సరం ముగిసాక చైనా…