సిక్కిం: ఇండియా-చైనా సరిహద్దులో ఉద్రిక్తత, సైన్యం మోహరింపు

సిక్కింలో తాజాగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇండియా, చైనా ఇరు దేశాలూ సిక్కింలో సరిహద్దు వద్ద సైన్యాలు మోహరించాయి. ఇండియా  3000 మంది సైనికులను తరలించగా చైనా కూడా అంతే సంఖ్యలో సైనికులను సరిహద్దుకు ఆవల మోహరించింది. భూటాన్, భారత భూభాగంలో చైనా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నదని ఇండియా ఆరోపించగా అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించి తమ కార్యకలాపాలను అడ్డుకుంటోందని చైనా ఆరోపించింది. ఇండియా ధోరణి ఇరు దేశాల సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలన్న ఏకాభిప్రాయ స్ఫూర్తికి విఘాతం…